ప్రేమ పేరిట మోసం... ప్రియుడి ఇంటిముందు యువతి నిరసన (వీడియో)

Published : Jun 08, 2021, 03:27 PM ISTUpdated : Jun 08, 2021, 03:58 PM IST
ప్రేమ పేరిట మోసం... ప్రియుడి ఇంటిముందు యువతి నిరసన (వీడియో)

సారాంశం

ఇంతకాలం ప్రేమించి ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే మొహం చాటేసిన ప్రియుడి ఇంటిముందు కూర్చుని ఓ యువతి నిరసనకు దిగింది. 

గుంటూరు: ప్రేమపేరుతో మోసం చేయడానికి ప్రయత్నించిన యువకుడి ఇంటిముందు యువతి నిరసనకు దిగింది. ఇంతకాలం ప్రేమించి ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే మొహం చాటేసి తిరుగుతున్నాడని బాధిత యువతి తెలిపింది. ప్రియుడితో పెళ్లి జరిగేవరకు నిరసన కొనసాగిస్తానంటూ ఇంటి ముందు కూర్చుని నిరసన చేపట్టింది.  

ఈ ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో చోటుచేసుకుంది. ప్రేమించావు కదా పెళ్లి చేసుకోడానికి అభ్యంతరం ఏమిటని అడిగితే యువకుడి నుండి జవాబులేదని యువతి తెలిపింది. గత నెలరోజులుగా ప్రియుడి బంధువులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని బాధిత యువతితో పాటు బంధువుల ఆరోపిస్తున్నారు. 

వీడియో

సాక్షాత్తు హోంమంత్రి మేకతోటి సుచరిత ఇలాకాలో ఓ మహిళకు అన్యాయం జరుగుతుంటే పోలీసులు పట్టించుకోవడం లేదంటూ యువతి బంధువుల ఆరోపించారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళితే పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే ఇలా నిరసనకు దిగినట్లు యువతి ఆవేదన వ్యక్తం చేసింది. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu