Guntur Road Accident: వైసిపి ఎమ్మెల్యే కు తృటితో తప్పిన ప్రమాదం

Arun Kumar P   | Asianet News
Published : Jan 30, 2022, 08:48 AM IST
Guntur Road Accident: వైసిపి ఎమ్మెల్యే కు తృటితో తప్పిన ప్రమాదం

సారాంశం

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తృటిలో ఫెను ప్రమాదం నుండి బయటపడ్డాడు. హైదరాబాద్ నుండి వెళుతున్న ఎమ్మెల్యే కారును మరో కారు ఢీకొట్టినా కారులోనే వున్న ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 

తణుకు: ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)కి చెందిన ఓ ఎమ్మెల్యే ఫెను ప్రమాదం నుండి బయటపడ్డారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురయినా ఆయన మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. గుంటూరు జిల్లా (guntur district)లో ఈ ప్రమాదం జరిగింది.  

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు (tanuku mla) నియోజకవర్గానికి చెందిన కారుమూరి నాగేశ్వరరావు (karumuri nageshwar rao) హైదరాబాద్ నుండి త్రిపురాంతకంకు కారులో వెళుతున్నారు. ఈ క్రమంలోనే కారు గుంటూరు జిల్లాలో ప్రయాణిస్తూ మాచర్ల సమీపంలోనే ఎత్తీపోతల వద్ద ఒక్కసారిగా ప్రమాదం చోటుచేసుకుంది.  

ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును వెనకవైపు నుండి అతివేగంతో  వచ్చి అదుపుతప్పిన మరో కారు ఢీకొట్టింది. అయితే ఎమ్మెల్యే కారు డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకే కాదు ఏ ఒక్కరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ప్రమాదానికి కారణమైన కారుతో పాటు ఎమ్మెల్యే కారుమూరి కారు కూడా బాగా దెబ్బతింది. దీంతో తన కారును అక్కడే వదిలి మరో కారులో త్రిపురాంతకం చేరుకున్నారు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు.

ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురయ్యిందని తెలిసి ఆయన అనుచరులు, తణుకు ప్రజలు, వైసిపి శ్రేణులు ఆందోళన గురయ్యారు. కానీ ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఆయన సురక్షితంగా బయటపడినట్లు తెలిసి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్