ఇంకా ప్రాసెస్ కానీ బిల్లులు, జనవరి జీతాలపై సందిగ్ధత.. ట్రెజరీ శాఖపై ఏపీ సర్కార్ గుస్సా

Siva Kodati |  
Published : Jan 29, 2022, 08:49 PM ISTUpdated : Jan 29, 2022, 08:53 PM IST
ఇంకా ప్రాసెస్ కానీ బిల్లులు, జనవరి జీతాలపై సందిగ్ధత.. ట్రెజరీ శాఖపై ఏపీ సర్కార్ గుస్సా

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాలు (Govt employees) - ప్రభుత్వానికి (ap govt) మధ్య పీఆర్సీ వార్ (prc) నడుస్తోన్న సంగతి తెలిసిందే. 1వ తారీఖు సమీపిస్తుండటంతో జీతాల (salaries) వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో ఉద్యోగులు, వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. పరిస్ధితులు చూస్తుంటే.. ఫిబ్రవరి ఒకటో తారీఖున ఉద్యోగుల అకౌంట్లలలో జనవరి నెల జీతాలు పడటం అనుమానంగానే కనిపిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాలు (Govt employees) - ప్రభుత్వానికి (ap govt) మధ్య పీఆర్సీ వార్ (prc) నడుస్తోన్న సంగతి తెలిసిందే. పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వం.. పాత జీతాలే కావాలని ఉద్యోగులు పట్టుబట్టడంతో వ్యవహారం వేడి మీదుంది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగ సంఘాలు నిరవధిక సమ్మెకు దిగనున్నాయి. అయితే 1వ తారీఖు సమీపిస్తుండటంతో జీతాల (salaries) వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో ఉద్యోగులు, వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. పరిస్ధితులు చూస్తుంటే.. ఫిబ్రవరి ఒకటో తారీఖున ఉద్యోగుల అకౌంట్లలలో జనవరి నెల జీతాలు పడటం అనుమానంగానే కనిపిస్తోంది.

జీతాలు ప్రాసెస్ చేయాల్సిందే అని ప్రభుత్వం.. మీరేం చేసినా ప్రాసెస్ చేసేది లేదంటూ ట్రెజరీ ఉద్యోగులు పంతానికి పోవడంతో వేతనాల విడుదలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలివ్వాలన్న విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. తమ ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవని ట్రెజరీ ఉద్యోగులకు ప్రభుత్వం వరుస పెట్టి సర్క్యూలర్స్‌ జారీ చేస్తూనే ఉంది. 

తాజాగా… వేతనాల బిల్లులను ప్రాసెస్ చేయకుండా మొండికేస్తున్న అధికారులపై చర్యలు తీసుకొనేందుకు ఆర్ధిక శాఖ (ap finance department) సిద్ధమైంది. దీనిలో భాగంగా జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయకుండా ఆదేశాలను ఉల్లంఘించిన డీడీఓలు, ట్రెజరీ అధికారులపై క్రమశిక్షణా చర్యల కోసం మెమోలు జారీ చేసింది. 2022 జనవరి 29 తేదీ సాయంత్రం 6 గంటల వరకూ తమ విధుల్లో విఫలమైన వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త వేతన స్కేళ్ల ప్రకారం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, వేతనాలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ట్రెజరీస్ డైరెక్టర్ కు, పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచిస్తూ ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 

కాగా.. జీతాలు, పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాలని జనవరి 25న ట్రెజరీ శాఖకు ఆర్ధిక శాఖ సర్క్యూలర్ జారీ చేసింది. కొత్త పీఆర్సీకి అనుగుణంగానే జీతాలు, పెన్షన్ల బిల్లులు ప్రాసెస్ చేయాలని స్పష్టం చేసింది. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే విధానాన్ని వివరిస్తూ ట్రెజరీ అధికారులకు డీడీవోలకు ఏపీ ఆర్ధిక శాఖ సర్క్యూలర్ జారీ చేసింది. అంతకుముందు జనవరి 20వ తేదీన కూడా రాష్ట్రంలోని ట్రెజరీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

అయితే ప్రభుత్వ ఒత్తిడికి కౌంటర్ వ్యూహం సిద్ధం చేసింది పీఆర్సీ సాధన సమితి (prc steering committee) . పెండింగ్ డీఏలతో కూడిన పాత జీతం ఇవ్వాలంటూ డీడీవోలకు రిక్వెస్ట్ లెటర్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు రిక్వెస్ట్ లెటర్ ప్రోఫార్మాను సిద్దం చేసింది పీఆర్సీ సాధన సమితి. తమకు పెండింగ్ డీఏలతో కూడిన పాత జీతం ఇవ్వాలంటూ పంచాయతీ రాజ్ శాఖ డీడీవోకు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు. ఈ లెటర్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వాన్ని సాంకేతికంగా ఇరుకున పెట్టొచ్చని భావిస్తోంది పీఆర్సీ సాధన సమితి. న్యాయ నిపుణులతో సంప్రదింపుల తర్వాత పాత జీతాలు కోరుతూ.. రిక్వెస్ట్ లెటర్ పెట్టాలని ఈ నిర్ణయం తీసుకుంది. 

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu