పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఏపీ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత ప్రకటించారు. ఇవాళ గంజి ప్రసాద్ కుటుంబాన్ని హోమంత్రి పరామర్శించారు. బాధిత కుటుంబాన్నిఓదార్చారు.
ఏలూరు: YCP నేత Ganji Prasad హత్య చేసిన వారితో పాటు హత్య చేయించాలని ప్రేరేపించిన వారిన కూడా కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి Taneti Vanitha ప్రకటించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలోని G.kothapalli లో వైసీపీ నేత గంజి ప్రసాద్ కుటుంబాన్ని ఆదివారం నాడు హోం మంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. ఎంపీటీసీ సభ్యుడు బజారయ్య పై మృతుడి కుటుంబ సభ్యలుఆరోపణలు చేస్తున్నారని మంత్రి చెప్పారు.ఈ విషయమై విచారణ చేస్తున్నామని మంత్రి చెప్పారు. చట్టం అనేది ఎవరికీ చుట్టం కాదన్నారు.బాధింప పడుతున్నవారి పక్షాన చట్టం నిలబడుతుందని మంత్రి వనిత హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆమె చెప్పారు.ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చట్టం తన పని చేసుకుపోతోందని మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. ఈ కేసు విషయంలో ఎవరినీ కూడా ఉపేక్షించబోమని హోంమంత్రి తెలిపారు. గంజి ప్రసాద్ కుటుంబానికి పార్టీతో పాటు, ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని వనిత స్పష్టం చేశారు.గంజి ప్రసాద్ పార్టీకి అందించిన సేవలను ఎప్పుడూ గుర్తు పెట్టుకొంటామని మంత్రి వనిత చెప్పారు.గంజి ప్రసాద్ కుటుంబానికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ హత్య ఎందుకు జరిగిందనే దానిపై దర్యాప్తు జరుగుతుందని ఏపీ మాజీ డిప్యూటీ సీఎం Alla Nani చెప్పారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటనగా నాని పేర్కొన్నారు. పోలీసులు పకడ్బందీగా వ్యవహరించడం వల్లే ముగ్గురు లొంగిపోయారన్నారు. ఈ కేసులో మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్న విసయాన్ని ఆళ్ల నాని గుర్తు చేశారు. ఢిల్లీలో ఉన్న సీఎం జగన్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లామన్నారు.నిష్పక్షపాతంగా విచారణ చేయాలని సీఎం జగన్ నుండి హోం మంత్రికి ఆదేశాలు అందాయని ఆళ్ల నాని చెప్పారు. గంజి ప్రసాద్ కుటుంబానికి వైసీపీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఆళ్ల నాని హామీ ఇచ్చారు. ప్రసాద్ హత్య కేసులో ఎవరున్నా కూడా ఉపేక్షించబోమని ఆయన చెప్పారు.దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఏదిపడితే అది మాట్లాడడం సరైంది కాదన్నారు.
ఇలాంటి ఘటన తనకు షాక్ కు గురి చేసిందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ చెప్పారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆశ్చర్యాన్ని కల్గించాయన్నారు. నిందితులు ఎంతటివారైనా వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
జి. కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ ను శనివారం నాడు ప్రత్యర్ధులు హత్య చేశారు. ఎంపీటీసీ సభ్యుడు బజారయ్యకు చెందిన అనుచరులు గంజి ప్రసాద్ ను హత్య చేశారు . ఈ కేసులో ముగ్గురు నిందితులు పోలీసులకు లొంగిపోయారు. మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీటీసీ సభ్యుడు బజారయ్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్నికలకు ముందు వరకు గంజి ప్రసాద్ టీడీపీలో ఉండేవాడు. ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో చేరారు. దీంతో బజారయ్య, గంజి ప్రసాద్ మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది.
గంజి ప్రసాద్ హోంమంత్రి తానేటి వనిత అనుచరుడిగా ఉన్నాడు. వనిత గతంలో టీడీపీలో ఉన్నారు. గోపాలపురం ఎమ్మెల్యేగా ఆమె టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. ఈ సమయంలో ఆయన వనిత మద్దతుదారుడిగా ఉన్నాడు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వనిత వైసీపీలో చేరారు. గత ఎన్నికల సమయంలో ప్రసాద్ కూడా వసీపీ తీర్ధం పుచ్చుకొన్నారు.