మా డబ్బులు మాకే ఇస్తారా..?: వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌ను ప్రశ్నించిన మహిళలు

Published : May 01, 2022, 11:58 AM IST
మా డబ్బులు మాకే ఇస్తారా..?:  వైసీపీ ఎమ్మెల్యే  సుధాకర్‌ను ప్రశ్నించిన మహిళలు

సారాంశం

కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే జె సుధాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనపై మహిళలు ప్రశ్నల వర్షం కురించడంతో పాటుగా.. ప్రసంగాన్ని అడ్డుకున్నారు. 

కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే జె సుధాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనపై మహిళలు ప్రశ్నల వర్షం కురించడంతో పాటుగా.. ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వివారు.. కర్నూలు జిల్లా గూడూరులో శనివారం సున్నా వడ్డీ పంపిణీపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్.. వైసీపీ ప్రభుత్వం మహిళలకు పెద్ద వేసిందని, మహిళల అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతుందని చెప్పారు. అయితే సుధాకర్ ప్రసంగం కొనసాగుతుండగా.. కొందరు మహిళలు అడ్డుకున్నారు. 

‘‘నిత్యావసరాలు, గ్యాస్, కరెంట్ చార్జీలు పెంచి.. మా డబ్బులు మాకే ఇస్తారా..?’’ అంటూ మహిళలు ఎమ్మెల్యే సుధాకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీరు సరిగా లేదని, రేషన్ బియ్యం కూడా సరిగా లేవని తెలిపారు. మహిళలకు రూ. 3 వేలు ఇచ్చి.. వేలకు వేల పన్నులు వసూలు చేస్తున్నారని.. వాటిని ఎలా కట్టాలని ప్రశ్నించారు. 

అయితే ఎమ్మెల్యే సుధాకర్ వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మహిళలు వినిపించుకోలేదు. దీంతో సుధాకర్ తన ప్రసంగాన్ని ఆపేసి చెక్కును అందజేసి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు యత్నించారు. అయితే తర్వాత ఎమ్మెల్యే కారును అడ్డుకున్న మహిళలు.. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆ తర్వాత మహిళలను పోలీసులు, స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు పక్కకు తీసుకెళ్లడంతో.. ఎమ్మెల్యే సుధాకర్ అక్కడి నుంచి ముందుకు కదిలారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu