రేపల్లే రైల్వే స్టేషన్ లో వివాహితపై గ్యాంగ్ రేప్: పోలీసుల అదుపులో ముగ్గురు

By narsimha lode  |  First Published May 1, 2022, 11:58 AM IST


గుంటూరు జిల్లాలోని రేపల్లె రైల్వే స్టేషన్ లో వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన అనుమానంతో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో సీసీటీవీ పుటేజీని కూడా పోలీసులు సీజ్ చేశారు.
 


గుంటూరు: ఉమ్మడి Guntur జిల్లాలోని Repalle రైల్వే స్టేషన్ లో వివాహితపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో ముగ్గురు అనుమానితులను Police అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.  వివాహితపై ఇద్దరు Gang Rape చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Railway Station  లో CCTV పుటేజీని కూడా పోలీసులు సేకరించారు. ఈ సీసీటీవీ పుజేటీ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ కు సమీపంలోనే నేతాజీ నగర్ ఉంటుంది. నేతాజీ నగర్ కు చెందిన ముగ్గురు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు.

Latest Videos

రేపల్లే రైల్వే స్టేషన్ లోని ఒకటో నెంబర్ ఫ్లాట్ ఫాంపై ఈ ఘటన చోటు చేసుకొంది. Netaji Nagar నుండి ముళ్ల పొదల గుండా రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ఫ్లాట్ హారానికి చేరుకొనే అవకాశం ఉంది. అయితే నిందితులు రేపల్లే రైల్వే స్టేషన్  లోకి వచ్చిన దృశ్యాలు రికార్డు కాలేదని సమాచారం.

Prakasam జిల్లా  Yerragondapalem మండలం వెంకటాద్రిపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం పనుల కోసం కృష్ణా జిల్లా నాగాయలంకకు వెళ్లేందుకు  బాపట్ల జిల్లా రేపల్లెకు వచ్చారు. శనివారం రాత్రి ముగ్గురు పిల్లలతో కలిసి భార్యాభర్తలు రేపల్లె రైల్వేస్టేషన్ లోనే  ఉన్నారు. ఉదయాన్నే వీరు కృష్ణా జిల్లాకు వెళ్లాలని భావించారు. రాత్రిపూట రేపల్లే రైల్వే స్టేషన్  ఒకటో నెంబర్ ఫ్లాట్ ఫాంపై పడుకొన్నారు. ఆదివారం నాాడు తెల్లవారుజామున భర్తను చితకబాదిన ముగ్గరు దుర్మార్గులు రైల్వే స్టేషన్ లోనే వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

తన కళ్లెదుటే భార్యపై అఘాయిత్యం జరుపుతుంటే ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో భర్త వుండిపోయాడు. రైల్వే స్టేషన్ లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి తలుపుతట్టినప్పటికి ఎవ్వరూ స్పందించలేరని బాధిత మహిళ భర్త తెలిపారు. దీంతో భార్యాపిల్లలను రైల్వే స్టేషన్లోనే వదిలి దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు పరుగున వెళ్ళి ఫిర్యాదు చేశారు. 

వెంటనే పోలీసులు బాధిత మహిళను వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ఆమె భర్త నుండి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలావుంటే పల్నాడు జిల్లా గురుజాల రైల్వేస్టేషన్లో ఇలాగే వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. మూడేళ్ల కొడుకుతో ఒంటరిగా వున్న ఒడిషా మహిళపై గుర్తుతెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అతి దారుణంగా లైంగికదాడికి పాల్పడటంతో అపస్మారక స్థితిలో పడివున్న మహిళను గుర్తించిన కొందరు హాస్పిటల్ కు తరలించారు. 

 ఇక గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని శృంగారపురం గ్రామానికి ఇతర ప్రాంతాల నుండి కూలీపనుల కోసం వచ్చిన ఓ మహిళ ఆలయంలో నిద్రిస్తుండగా కొందరు యువకులు అఘాయిత్యానికి యత్నించారు. నిద్రిస్తున్న మహిళను దగ్గర్లోని తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె గట్టిగా అరిచింది. దీంతో భయపడిపోయిన యువకులు పరారయ్యారు. యువతి కుటుంబసభ్యుల పిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకులను అరెస్ట్ చేశారు.

ఇక తుమ్మపూడిలో వివాహిత హత్య సంచలనం సృష్టించింది. మహిళపై అత్యాచారం జరిపి హత్య చేసినట్లు ప్రచారం జరగ్గా గుంటూరు ఎస్పీ సంచలన విషయాలు బయటపెట్టాడు. మహిళపై అత్యాచారం జరగలేదని... ఇది వివాహేతర సంబంధం కారణంగా జరిగిన హత్యగా గుంటూరు అర్భన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. 

click me!