ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషించనున్నారు: తలసాని

sivanagaprasad kodati |  
Published : Jan 07, 2019, 10:33 AM IST
ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషించనున్నారు: తలసాని

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తారన్నారు ఆ రాష్ట్ర మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవాళ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 4 నెలలలో దేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని జోస్యం చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తారన్నారు ఆ రాష్ట్ర మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవాళ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 4 నెలలలో దేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ కీలకపాత్ర పోషిస్తుందని తలసాని అన్నారు.

కొత్త ఏర్పడ ఏపీలో పరిపాలన సక్రమంగా లేదని ఎద్దేవా చేశారు. అధికారపక్షం పనులు చేయకుండా.. ప్రతిపక్షం తరహాలో దీక్షలు చేస్తోందని తలసాని మండిపడ్డారు.  ఎన్టీఆర్ సిద్ధాంతాలను పక్కనబెట్టి చంద్రబాబు కాంగ్రెస్ వెంట నడుస్తున్నారని ఆరోపించారు. బాబు పనులు చేయకుండా పబ్లిసిటీతో గడిపేస్తున్నారని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Serious: ఈ హాస్టల్ కంటే జైల్ బెటర్.. పిల్లలు ఏడుపే తక్కువ | Asianet News Telugu
బిలాయి నుండివచ్చాం.. ఆంధ్రాకల్చర్ ని ఎంజాయ్ చేశాం:Visakhaలో Bhogi Celebrations | Asianet News Telugu