తాడిపత్రి ఘటన: జేసీ వర్గీయులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

Published : Dec 25, 2020, 11:17 AM ISTUpdated : Dec 25, 2020, 11:33 AM IST
తాడిపత్రి ఘటన: జేసీ వర్గీయులపై  ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

సారాంశం

 జిల్లాలోని తాడిపత్రిలో గురువారం నాడు టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణల్లో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

అనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో గురువారం నాడు టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణల్లో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

తాడిపత్రి ఎమ్మెల్యే  కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి ప్రభాకర్ రెడ్డి వర్గీయులపై గురువారం నాడు దాడికి దిగారు. దీంతో కేతిరెడ్డి వర్గీయులపై టీడీపీ వర్గీయులు రాళ్ల దాడికి దిగారు. ఇరు వర్గాలు రాళ్ల దాడి చేసుకొన్నారు.

also read:తాడిపత్రిలో 144 సెక్షన్: సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వలీపై కేసు

వైఎస్ఆర్ఎస్‌సీపీకి చెందిన మనోజ్ అనే కార్యకర్తపై టీడీపీ దాడికి దిగిందని వైఎస్ఆర్ఎస్‌పీ ఆరోపించింది. మనోజ్ పై దాడికి దిగినందుకు గాను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులపై  పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

తన ఇంటికి వచ్చి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులపై దాడికి దిగిన ఘటనపై  జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ నేపథ్యంలో తాడిపత్రిలో 144 సెక్షన్ ను పోలీసులు విధించారు.


 

PREV
click me!

Recommended Stories

Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి
YS Jagan Massive Rally & Governor Meet: అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు | YSRCP | Asianet News Telugu