తల్లి మృతి, మద్యానికి తండ్రి బానిస: తాడిపత్రి ఎమ్మెల్యే ఔదార్యం

By narsimha lodeFirst Published Sep 23, 2020, 11:43 AM IST
Highlights

తల్లి మరణించి, మద్యానికి బానిసగా మారిన తండ్రి కారణంగా ఇబ్బంది పడుతున్న చిన్నారి సంరక్షణ బాధ్యతను తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీసుకొన్నారు.తాడిపత్రి మండలంలోని పెద్దపొలమడకు చెందిన నాగలక్ష్మి, అర్జున్ రెడ్డి దంపతులకు అజయ్ కుమార్ రెడ్డి అనే కొడుకు ఉన్నాడు.


తాడిపత్రి: తల్లి మరణించి, మద్యానికి బానిసగా మారిన తండ్రి కారణంగా ఇబ్బంది పడుతున్న చిన్నారి సంరక్షణ బాధ్యతను తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీసుకొన్నారు.తాడిపత్రి మండలంలోని పెద్దపొలమడకు చెందిన నాగలక్ష్మి, అర్జున్ రెడ్డి దంపతులకు అజయ్ కుమార్ రెడ్డి అనే కొడుకు ఉన్నాడు.

15 రోజుల క్రితం నాగలక్ష్మి అనారోగ్యంతో మరణించింది. అప్పటికే మద్యానికి బానిసగా మారిన అర్జున్ రెడ్డి కొడుకు ఆలానా పాలనను పట్టించుకోవడం మానేశాడు. భార్య మరణించడంతో అర్జున్ రెడ్డికి అడ్డు లేకుండా పోయింది. మద్యానికి బానిసగా మారిన ఆయన కొడుకు గురించి పట్టించుకోవడం మానేశాడు. దీంతో గ్రామస్తులు అజయ్ కుమార్ రెడ్డికి అన్నం పెట్టేవారు. ఈ విషయాన్ని గ్రామస్తులు అర్జున్ రెడ్డి పరిస్థితిని ఎమ్మెల్యే పెద్దారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.

ఆ బాలుడిని మంగళవారం నాడు ఎమ్మెల్యే తన   కార్యాలయానికి పిలిపించుకొన్నాడు. తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే  బాలుడికి హామీ ఇచ్చాడు. ఆ బాలుడి సంరక్షణ బాద్యతలు తీసుకొంటానని ఎమ్మెల్యే గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అజయ్ కుమా రెడ్డి  చదువు బాధ్యతలను తాను తీసుకొంటానని ఎమ్మెల్యే చెప్పారు.


 

click me!