తాడిపత్రిలో టెన్షన్: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఇద్దరిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి దాడి

Published : Dec 24, 2020, 01:05 PM ISTUpdated : Dec 24, 2020, 01:15 PM IST
తాడిపత్రిలో టెన్షన్: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఇద్దరిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి దాడి

సారాంశం

 అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హల్ చల్ చేశారు. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా  పోస్టింగ్ లు పెట్టారనే ఆగ్రహంతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఎమ్మెల్యే హల్ చల్ చేశారు.

అనంతపురం:  అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హల్ చల్ చేశారు. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా  పోస్టింగ్ లు పెట్టారనే ఆగ్రహంతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఎమ్మెల్యే హల్ చల్ చేశారు.

తమ ఇంట్లో ఉన్న ఇద్దరిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడికి దిగారని పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి  ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చిన సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు ఇంట్లో లేరని సమాచారం.

ఈ విషయం తెలుసుకొన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు,.సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెట్టిన ఇద్దరిపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు కూడ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఉన్నారని తెలుసుకొని అక్కడికి చేరుకొన్నారు. జేసీ ఇంట్లో ఉన్న ఇద్దరిపై దాడికి దిగినట్టుగా సమాచారం.

PREV
click me!

Recommended Stories

Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి
YS Jagan Massive Rally & Governor Meet: అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు | YSRCP | Asianet News Telugu