నన్ను చంపాలని చూస్తున్నారు: సజ్జలపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనం

By narsimha lodeFirst Published Dec 27, 2020, 3:27 PM IST
Highlights

నన్ను చంపాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తున్నారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. 

తాడిపత్రి: నన్ను చంపాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తున్నారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. 

ఆదివారం నాడు తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  తనకు గన్ లైసెన్స్ ఉందన్నారు. కానీ తన గన్ లైసెన్స్ రెన్యూవల్ కోసం ధరఖాస్తు చేసుకొంటే ఇంతవరకు రెన్యూవల్ చేయలేదన్నారు. 

also read:తాడిపత్రి ఘటన: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు

రెన్యూవల్ ఎందుకు చేయలేదో కూడ ఇంతవరకు చెప్పలేదన్నారు. గన్ లైసెన్స్ రెన్యూవల్ రిజెక్ట్ చేసేవరకు తాను గన్ ను తన వద్ద ఉంచుకోవచ్చన్నారు. కానీ గన్ ను తన వద్ద పెట్టుకొంటే కేసులు పెడతారనే ఉద్దేశ్యంతో తాను గన్ ను డిపాజిట్ చేసినట్టుగా ఆయన చెప్పారు. 

తనతో మాట్లాడేందుకు వచ్చినట్టుగా చెప్పిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంట్లో పనిచేసే వికలాంగుడిపై ఎందుకు దాడి చేశాడని ఆయన ప్రశ్నించారు.పెద్దారెడ్డి నా ఇంటికి వచ్చిన సమయంలో తాను కానీ, తన కొడుకు కానీ ఇంట్లో లేమన్నారు. 

కేసులు పెట్టాల్సి వస్తే 9 మంది గన్‌మెన్లపై పెట్టాల్సి వస్తోందన్నారు. ఒకప్పుడు తనకు కూడా గన్ మెన్లు ఉన్నారని ఆయన చెప్పారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా కేసులు పెట్టమంటే  పై నుండి ఒత్తిడి ఉందని పోలీసులు అంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. 

పోలీసులంటే తనకు గౌరవం ఉందన్నారు. అధికారంలో ఉన్నవారికి 50 నుండి 60 శాతం అనుకూలంగా ఉంటే.. విపక్షంలో ఉన్నవారికి పోలీసులు కనీసం 40 శాతం అనుకూలంగా ఉండేవారన్నారు.

ఎస్ఐ నుండి ఎస్పీ వరకు తమపై ఒత్తిడి ఉందని చెబుతున్నారన్నారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి నుండి పోలీసులపై ఒత్తిడి ఉందని ఆయన ఆరోపించారు.తమ ఇంటి వద్దకు ఎమ్మెల్యేను ఆయన మనుషులను  యధేచ్ఛగా దాడి చేసినా కూడ పట్టించుకోలేదన్నారు.

తాను కేసు పెడితే 9 మంది గన్ మెన్లు ఓ ఎస్ఐ సస్పెండ్ అవుతారని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పోలీసులంటే అమితమైన గౌరవం ఉందన్నారు. పోలీసులు న్యాయంగా వ్యవహరించాలని ఆయన కోరారు. 


 

click me!