లోకేష్ క్యాంప్ వద్దకు వస్తే పంచెలూడదీసి కొడతారు: కేతిరెడ్డికి జేసీ కౌంటర్

By narsimha lodeFirst Published Apr 9, 2023, 4:31 PM IST
Highlights

తాడిపత్రి  ఎమ్మెల్యే  కేతిరెడ్డి  పెద్దారెడ్డికి  మాజీ ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర్ రెడ్డి  స్ట్రాంగ్  కౌంటర్  ఇచ్చారు.  పంచె లూడదీసి  కొడతానని  జేసీ ప్రభాకర్ రెడ్డి  వార్నింగ్  ఇచ్చారు.

తాడిపత్రి: లోకేష్ క్యాంప్ వద్దకు  వస్తే  పంచలూడదీసి  కొడతారని  మాజీ ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర్ రెడ్డి  తాడిపత్రి  ఎమ్మెల్యే   కేతిరెడ్డి పెద్దారెడ్డికి  వార్నింగ్  ఇచ్చారు. ఉమ్మడి  అనంతపురం జిల్లాలో  టీడీపీ జాతీయ  ప్రధాన కార్యదర్శి లోకేష్  పాదయాత్ర సాగుతుంది.  త్వరలోనే  తాడిపత్రి  నియోజకవర్గంలో  లోకేష్  పాదయాత్ర  ఎంటర్ కానుంది. తనపై  లోకేష్ నిరాధార  ఆరోపణలు  చేస్తే  చూస్తూ  ఊరుకోనని  కేతిరెడ్డి  పెద్దారెడ్డి  చెప్పారు.  

also read:తప్పుడు ఆరోపణలు చేస్తే సహించను:లోకేష్‌కు కేతిరెడ్డి వార్నింగ్

కేతిరెడ్డి పెద్దారెడ్డి  వార్నింగ్  పై   మాజీ ఎమ్మెల్యే  జేసీ  ప్రభాకర్ రెడ్డి  స్పందించారు.  కేతిరెడ్డి  పెద్దారెడ్డిని  ఉత్తరకుమారుడిగా  జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.   థూ...థూ...  కేతిరెడ్డి  పెద్దారెడ్డి గురించి తాను మాట్లాడబోనన్నారు.  లోకేష్  క్యాంప్ వద్దకు  వస్తే తన ఇంట్లో  పని మనుషులే  కేతిరెడ్డి పెద్దారెడ్డిని పంచె ఊదడీసి కొడతారని  ఆయన  హెచ్చరించారు.  ఆరు నెలల తర్వాత  పంచె ఊడదీసేందుకు  ప్రజలు సిద్దంగా  ఉన్నారన్నారు. కానీ  ముందుగానే  పంచె ఊడగొట్టించుకొనేందుకు   కేతిరెడ్డి  పెద్దారెడ్డి  ఆరాట పడుతున్నట్టు కన్పిస్తుందన్నారు.  ఆలూరుకు తనను వెళ్లకుండా  అడ్డుకున్నాడని  కేతిరెడ్డి పెద్దారెడ్డిపై  జేసీ ప్రభాకర్ రెడ్డి  మండిపడ్డారు.

గత  ఎన్నికల్లో  తాడిపత్రి  నుండి పోటీ చేసిన  జేసీ ప్రభాకర్ రెడ్డి  కొడుకు   అస్మిత్ రెడ్డి ఓటమి  పాలయ్యాడు.  వైసీపీ  అభ్యర్ధి కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల తర్వాత  తాడిపత్రిలో కేతిరెడ్డి  పెద్దారెడ్డి,  జేసీ  ప్రభాకర్ రెడ్డి  మధ్య  కొంత కాలంగా  మాటల యుద్ధం సాగుతుంది. మున్సిపల్ఎన్నికల్లో   తాడిపత్రిలో  టీడీపీ విజయం సాధించింది.  రాష్ట్రంలో  టీడీపీ విజయంసాధించి న ఏకైక  మున్సిపాలిటీ టీడీపీయే . మున్సిపాలిటీలో  విజయం సాధించిన తర్వాత  ఎమ్మెల్యే  కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మాటల తీవ్రతను మరింతను  జేసీ  పెంచాడు.  ఇరువర్గాలు  ఎదరుపడితే  ఇబ్బందికర  పరిస్థితులు  నెలకొనే అవకాశం లేకపోలేదు. దీంతో  ఈ ఇద్దరు  ఎదరుపడకుండా  పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ఇటీవల  కాలంలో   ఆలూరులో  రంగనాథస్వామి రథోత్సవంలో  జేసీ ప్రభాకర్ రెడ్డి  పాల్గొనకుండా  పోలీసులు   అడ్డుకున్నారు.  ఇవాళ మీడియాతో మాట్లాడే సమయంలో ఈ విషయాన్ని జేసీ  ప్రభాకర్ రెడ్డి  గుర్తు  చేశారు. లోకేష్  పాదయాత్ర  తాడిపత్రి  నియోజకవర్గంలో  ప్రవేశించకముందే టీడీపీ, వైసీపీ  మధ్య  సవాళ్లు, ప్రతి సవాళ్లతో  ఉద్రిక్త వాతావరణం  నెలకొంది. 
 

click me!