జగనన్నే మా నమ్మకం కార్యక్రమం.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Apr 09, 2023, 03:05 PM ISTUpdated : Apr 09, 2023, 03:10 PM IST
జగనన్నే మా నమ్మకం కార్యక్రమం.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

జగనే మా నమ్మకం అని 90 శాతం మంది ప్రజలు చెప్పకుంటే తాను రాజకీయాలను వదిలేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్ విసిరారు . చంద్రబాబుతో వున్న వారందరిది రాక్షస మనస్తత్వమని నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. 

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మేనిఫెస్టోని ప్రజలు నమ్మే పరిస్ధితి లేదన్నారు. చంద్రబాబుతో వున్న వారందరిది రాక్షస మనస్తత్వమన్నారు. జగనే మా నమ్మకం అని 90 శాతం మంది ప్రజలు చెప్పకుంటే తాను రాజకీయాలను వదిలేస్తానని నారాయణ స్వామి సవాల్ విసిరారు. 

ఇకపోతే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్‌పై స్పందించారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి . శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెల్ఫీ ఛాలెంజ్‌కు తాము సిద్ధమన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు పనిగట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఏపీలో వ్యవసాయాభివృద్ధి జాతీయ స్థాయి కంటే ఎక్కువగా వుందని ఆయన పేర్కొన్నారు. పౌల్టీ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ ముందంజలో వుందన్నారు. చంద్రబాబు హయాంలో నీరులేక వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయిందని కాకాణి గోవర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు. 

Also Read: తప్పుడు ఆరోపణలు చేస్తే సహించను:లోకేష్‌కు కేతిరెడ్డి వార్నింగ్

చంద్రబాబు హయాంలో 16 వందల ఎకరాలను కరువు మండలాలుగా ప్రకటించారని.. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క కరువు మండలం కూడా లేదని మంత్రి పేర్కొన్నారు. వర్షాలు సంవృద్ధిగా కురుస్తున్నాయని.. చంద్రబాబు వచ్చి వైసీపీ నేతలను తిట్టి వెళ్లారని కాకాణి గోవర్థన్ రెడ్డి దుయ్యబట్టారు. రైతులు పండించిన ధాన్యానికి మంచి ధర వస్తోందని.. దీనిని చూసి సోమిరెడ్డి తట్టుకోలేకపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో టీడీపీ బలహీనంగా వుందని.. ప్రజలకు సేవ చేయకుండా మీడియా ద్వారా వ్యతిరేకత తీసుకొచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?