
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని (ap cm jagan mohan reddy) ఆయన నివాసంలో విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి (swathmanamdemdra swami) సోమవారం కలిశారు. ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను సీఎంకు అందించారు. అనంతరం సీఎం జగన్ కు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వేద ఆశీర్వచనం అందజేశారు. కాగా వచ్చే నెలలో 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆ పీఠంలో వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. ఉత్తరాధికారితో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (ttd chairman yv subbareddy) కూడా సీఎంను కలిశారు.