శ్రీవారి ఆలయం మూసివేత వెనుక కుట్ర.. స్వరూపానందేంద్ర సరస్వతి అనుమానం

First Published Jul 17, 2018, 10:04 AM IST
Highlights

మహా సంప్రోక్షణ పేరుతో తొమ్మిది రోజుల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం వెనుక కుట్ర దాగివుందన్నారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అనుమానం వ్యక్తం చేశారు

మహా సంప్రోక్షణ పేరుతో తొమ్మిది రోజుల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం వెనుక కుట్ర దాగివుందన్నారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అనుమానం వ్యక్తం చేశారు. సంప్రోక్షణ జరిగే సమయంలో సీసీ కెమెరాలను సైతం ఆపివేస్తామని టీటీడీ అధికారులు ప్రకటించడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.. ఆగమశాస్త్రం ప్రకారం మహా సంప్రోక్షణ జరిగే విధానాన్ని భక్తులు తిలకించవచ్చని ఆయన అన్నారు..

ఆలయం మూసివేసే నిర్ణయం తీసుకునే ముందు కంచి, శృంగేరి పిఠాధిపతులతో సంప్రదించారా..? అని స్వరూపానందేంద్ర టీటీడీని ప్రశ్నించారు.. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలు భక్తుల్లో అనుమానాలను పెంచుతున్నాయని స్వామిజీ ఆరోపించారు. కాగా, పన్నెండేళ్లకొకసారి శ్రీవారి ఆలయంలో నిర్వహించే మహాసంప్రోక్షణ  కార్యక్రమాన్ని వచ్చే నెల 9 నుంచి 17 వరకు నిర్ణయించేందుకు టీటీడీ నిర్ణయించింది. ఈ కార్యక్రమం జరిగినన్ని రోజులు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

click me!