విశాఖపట్టణం సింహాచలం అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లపై విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
విశాఖపట్టణం: జిల్లాలోని సింహాచలం అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారంనాడు ఆయన సింహాచలంలో మీడియాతో మాట్లాడారు. సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరించారని ఆయన అధికారులపై మండిపడ్డారు.
గుంపులుగా పోలీసులను పెట్టారన్నారు. కానీ ఏర్పాట్లు సరిగా లేవన్నారు. తన జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హాజరయ్యానని చెప్పారు.ఎందుకు దర్శనానికి వచ్చానా అని బాధపడుతున్నానన్నారరు.
కొండ కింద నుండి పై వరకు రద్దీ ఉందన్నారు. కానీ భక్తులకు జవాబు చెప్పేవారు లేరని చెప్పారు.
తన జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితిని చూడలేదని స్వరూపానందరేంద్ర చెప్పారు. భక్తుల ఆర్తనాదాలు వింటూంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు.
భక్తుల ఇబ్బందుల మధ్య దైవ దర్శనం బాధ కలిగించిందని స్వరూపానందేంద్ర చెప్పారు.
ఇలాంటి చందనోత్సవ నిర్వహణ ఎప్పుడూ జరగలేదన్నారు. ఆచారాలను మంటగలిపారని ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు.