బెదిరిస్తే చంపేస్తారా?

First Published May 25, 2017, 9:00 AM IST
Highlights

నారాయణరెడ్డి హత్యకు బెదిరింపులే కారణమంటూ పోలీసులు చెప్పటం పలుఅనుమానాలకు తావిస్తోంది. పోనీ బెదిరించింది కూడా నారాయణరెడ్డి కాదు. ఆయన మనుషులు. నారాయణరెడ్డి మనుషులు బెదిరిస్తే నారాయణరెడ్డిని చంపేస్తారా అన్న ప్రశ్నకు పోలీసులు వద్ద సమాధానం లేదు.

చంపుతామని బెదిరించినందుకే ప్రత్యర్ధులు నారాయణరెడ్డిని హత్య చేసారట. పోలీసులు చెబుతున్న విషయం ఎంత హాస్యాస్పదంగా ఉందో అర్ధమవుతోంది. చెరుకులపాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు, కోతుల రామానాయుడులను చంపుతామని నారాయణరెడ్డి మనుషులు బెదిరించారట. తమను వారు ఎక్కడ చంపేస్తారో అన్న భయంతోనే నారాయణరెడ్డి, సాంబశివుడిని ప్రత్యర్ధులు చంపేసారని పోలీసులు తేల్చారు. ఎవరైనా తమను కొడతారంటేనో లేదా చంపుతామనో అన్నా పట్టించుకోరు. ఎందుకంటే, ఆవేశంలో అనేకమంది అనేకం అంటుంటారు. వాటిని ఎవరూ సీరియస్ గా తీసుకోరు.

అయితే, ఎదుటివారు సీరియస్ గా అన్నారని అనిపిస్తే వెంటనే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. అంతేకాని ముందుజాగ్రత్తగా తమను బెదిరించినవారిని చంపేయరు. కానీ నారాయణరెడ్డి హత్యకు బెదిరింపులే కారణమంటూ పోలీసులు చెప్పటం పలుఅనుమానాలకు తావిస్తోంది. పోనీ బెదిరించింది కూడా నారాయణరెడ్డి కాదు. ఆయన మనుషులు. నారాయణరెడ్డి మనుషులు బెదిరిస్తే నారాయణరెడ్డిని చంపేస్తారా అన్న ప్రశ్నకు పోలీసులు వద్ద సమాధానం లేదు. పోనీ నారాయణరెడ్డి మనుషులు తమను బెదిరిస్తున్నారని ఎప్పుడైనా బాధితులు ఫిర్యాదు  చేసారా? అంటే అదీ లేదు.  

ఇక్కడ మ్యాటర్ వెరీక్లియర్. ప్రత్యర్ధులు నారాయణరెడ్డిని హత్య చేయటమే లక్ష్యంగా వ్యూహం పన్నారు. దాన్ని పక్కగా అమలూ చేసారు. మిగిలినదంతా డ్రామా అని తెలుస్తూనే ఉంది. నారాయణరెడ్డి కుటుంబసభ్యులేమో కెఇ కృష్ణమూర్తి కుమారుడు కెఇ శ్యాంబాబే సూత్రధారిగా ఆరోపణలు చేస్తున్నారు.

ఎఫ్ఐఆర్లో శ్యాంబాబుని ఏ-14గా పేర్కొన్నారు. అయితే, పోలుసులు అరెస్టు చేసిన 12మందిలో శ్యాంబాబు లేరు. మీడియా సమావేశంలో ఏ 14 గురించి అడిగిన ప్రశ్నకు జిల్లా ఎస్పీ సామాధానం చెప్పలేదు. బాధితుడి కుటుంబం ఫిర్యాదు మేరకైనా పోలీసులు శ్యాంబాబును విచారించను కూడా లేదు. అంటే, బాధితుడినే బాధ్యునిగా చేయటానికి పక్కా ప్లాన్ జరిగిందన్న విషయం స్పష్టం అవుతోంది.

click me!