
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పోరాటం అంటే భయం.
పోరాటం తప్ప ఆయనేపనయినా చేస్తాడు. పోరాటం చేయాల్సి వస్తే... వెంటనే రాజీ అయిపోతాడు. ఇది ఒక సారి అనేక సార్లు జరిగింది ఇపుడు జరుగుతూ ఉంది.
కులం, డబ్బు,అధికారం ఆయన బలం. ఇవేవీ పనిచేయవు అన్నపుడు‘సుబ్బరంగా’ రాజీ చేసుకుంటాడు. వోటుకు నోటు కేసులో ఎంత ధ్వని పుట్టించాడు. నన్న అరెస్టు చేస్తే తెలంగాణాయే ఉండదన్నారు. ఏమేమో మాట్లాడారు. ఇక కష్టం. తెలంగాణా పోలీసుల చేతుల్లో తన జాతకం ఉందని తెలుస్తూనే తెల్లజండా వూపాడు. అప్పటినుంచి ఇప్పటి దాకా రాజీధర్మం పాటిస్తూ ఉన్నాడు. తెలంగాణాలో పార్టీ బలపడేందుకు ఒక్క టూర్ చేయలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన లోకేశ్ బాబును కూడా పంపలేదు. హైదరా బాద్ ఇల్లు దాటి బయట కాలుపెడితే ఒట్టు. కెసిఆర్ ను పల్లెత్తు మాట అనడం లేదు.
చివరకు నిన్న టి తెలంగాణా తెలుగుదేశం మహానాడులో కూడా రాజీధర్మం పాటించాడు. రాజకీయాలు నడపాలనుకునే వాడికి ముందు శత్రువెవరో తెలియాలి. శత్రువుని శత్రువనేందుకు భయపడేవాడు రాజకీయాలేంచేస్తాడు.అందుకే టిడిపి కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చంద్రబాబు రాజీ ధోరణిని పక్కన పడేసి పోరాటం ఎంచుకున్నాడు. గెలుపో ఓటమో తర్వాత.
మోదీతో చాలా రోజులుగా బాబు గారు రాజీ రాజకీయాలు నడిపిస్తున్నాడు. ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఆయన మోదీని పొగుడుతున్నారు. మోదీనినొప్పించకండని ఆయన అందరినీ ఆదేశించారు. అమిత్ షా అంధ్ర కొస్తున్నాడంటే రాజీ ప్రపోజల్ నేరుగా ప్రతిపాదించబోతున్నారు. మేము బిజెపితో వస్తాం, ఎన్ డిఎలో మా జాగా అలాగే ఉంచండని బతిమాలపోతున్నారట.
కొట్లాడితే కేంద్రం నుంచి ఏమోస్తాయని ఆయన చాలా సార్లు అన్నారు. హోదా కోసం కొట్లాడితే ఉన్నవి వూడిపోయతాని హెచ్చరించారు. హోదా పట్టుకుంటే మోదీకి కోపమొస్తుందేమోననే ఆయన ఆయన ప్యాకేజీ అనే బ్రహ్మపదార్థం చూపిస్తుంటారు. అందులో ఉండేవి రాష్ట్రానికి రావలసినవే.
సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నపార్టీ పవర్ లోకి వచ్చేందుకు ఎలా రాజీకీయాలుచేస్తుంటారు. సిద్ధాంతాలు పక్కన పెట్టి బంధుత్వాలు కలపుకుంటూ ఉంటారు. అధికారంలో ఉన్నోళ్లు ఇన్ని తిప్పలు పడరు, కాళ్ల కింద భూమి కదులుతూందేమో అనుకుంటే తప్ప.
ఇంతగా బాబు రాజీ బాట పట్టడానికి కారణం, తన గురించి అవతలి వారికి మరీ ఎక్కువగా తెలుసనే భయమయినా అయివుండాలి లేదా రాజీ లాభసాటి అని తెలుసుండాలి.
బిజెపితో తాను సఖ్యంగా ఉన్నా పవన్ కల్యాణ్ ఉత్తరాది పెత్తనం అంటూ ఒక దారి వెదుక్కున్నారు. అంత తీవ్రంగా పోకపోయినా, బిజెపి, కేంద్రం ధోరణి చూశాక కనీసం భాషలోనైనా పవర్ ఉండాలి. అంధ్రలో పట్టమని పది సీట్లు కూడా లేని పార్టీతో ఇంత రాజీదోరణి ప్రయోజనమేమిటో... ఉండకుండా ఉండదు. గమనిస్తూ ఉండాలి.