కర్నూలు జిల్లాలో చిరుత పులి అనుమానాస్పద మృతి..

By SumaBala BukkaFirst Published Nov 3, 2022, 11:51 AM IST
Highlights

కర్నూలు జిల్లాలో ఓ చిరుతపులి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పోస్టుమార్టం నివేదికలో పులి మీద ఎలాంటి గాయాలు లేవని తేలింది. 

కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లా, కోసిగి మండలంలోని దుద్ది, వందగల్ గ్రామాలమధ్య  ఉన్న వరగోట్టు సమీపంలో మంగళవారం నాడు చిరుత పులి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ మేరకు జిల్లా అటవీశాఖ అధికారి శివశంకర్ రెడ్డి తెలిపారు. కింది స్థాయి సిబ్బంది అందించిన సమాచారం మేరకు చిరుతపులి చనిపోయిన ప్రాంతానికి చేరుకొని ఎన్ పీసీఏ  గైడ్ లెన్స్ ప్రకారం ఒక కమిటీగావెళ్లి పోస్ట్ మార్టం చేయించడం జరిగిందని తెలిపారు. 

ముందుగా నేషనల్ టైగర్స్ కంజన్స్ ఆఫ్ అథారిటీ హెడ్ ఆఫీస్ బెంగళూర్ వారికి సమాచారం ఇచ్చి, వారి అనుమతి తీసుకొని తదుపరి కార్యక్రమాలు జరిపించినట్లు తెలిపారు. చిరుత పులిపై ఎటువంటి గాయాలు లేవని పోస్టు మార్టంలో తేలిందని అన్నారు. ఈ రిపోర్ట్ ఆధారంగా విచారణ చేపడుతామన్నారు. 

వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణ స్వామి బృందం పోస్ట్ మార్టం నిర్వహించి చిరుత పులి మృతదేహాన్ని అక్కడే ఖననం చేశారు. ఇందులో ఫారెస్ట్ అధికారులు స్కాడ్ రేంజర్ ఆఫీసర్ సుదర్శన్ ,సెక్షన్ ఆఫీసర్ మనిధర్, ఆదోని రేంజర్ ఆఫీసర్ రామచంద్రుడు, బీట్ ఆఫీసర్ అనురాధ ప్రొటెక్షన్ వాచర్ శంకర్ నాయక్ పాల్గొన్నారు.

click me!