విశాఖపట్నంలో కలకలం రేపిన ఆంత్రాక్స్ కేసుల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జె నివాస్ తెలిపారు. అయితే.. టిష్యూ కల్చర్ పరీక్షలు ఫలితాలు వస్తే కానీ ఏదీ నిర్థారించలేమని దానికి 48గంటల సమయం పడుతుందన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా : అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపట్టులో ఆంత్రాక్స్ కలకలం రేగింది. ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నాయని అనుమానంతో ఏడుగురు నుంచి నమూనాలు సేకరించి నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జె నివాస్ తెలిపారు. ప్రాథమిక పరీక్ష ఫలితాల్లో నెగెటివ్ అని రిపోర్టు వచ్చినట్లు ఆయన తెలిపారు. టిష్యూ కల్చర్ పరీక్షలు పూర్తి ఫలితాలు వచ్చేందుకు 48 గంటల సమయం పడుతుందన్నారు. వచ్చిన రిపోర్టుల ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. ముంచంగిపట్టు గ్రామంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని ఆ ప్రాంతంలో జంతువులు అన్నింటికీ వాక్సినేషన్ చేసినట్లు తెలిపారు. స్థానికులకు వైద్య పరీక్షలు, స్క్రీనింగ్ నిర్వహించినట్లు కమిషనర్ వెల్లడించారు.
కాగా, ఆగస్ట్ 26న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు (ఏఎస్‌ఆర్) జిల్లా ముంచింగిపుట్ మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని దొరగూడ గ్రామంలో అనుమానాస్పద ఆంత్రాక్స్ ఇన్ఫెక్షన్ కారణంగా ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దు (AOB) వెంబడి ఉన్న మారుమూల గ్రామానికి చెందిన గిరిజనులు 10 రోజుల క్రితం చనిపోయిన పశువుల మాంసాన్ని తిన్నారు. అనంతరం గ్రామంలోని ఏడుగురు చిన్నారులకు వ్యాధి లక్షణాలు కనిపించాయి.
undefined
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. వరుసగా చనిపోతున్న అడవి పందులు.. వ్యాధి లక్షణాలు ఇవే!
ఏఎస్ఆర్ జిల్లాలో అనుమానిత ఆంత్రాక్స్ వ్యాప్తి..
కొద్దిరోజుల క్రితం లబ్బూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లోని వారం వారం నిర్వహించే వైద్య శిబిరంలో భాగంగా చిల్లి లక్ష్మీపురంలో చిన్నారుల్లో ఆంత్రాక్స్ అనుమానిత లక్షణాలను గుర్తించారు. సమాచారం అందుకున్న అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ లీలా ప్రసాద్, మరికొంత మంది పరిస్థితిని సమీక్షించడానికి కొండ ప్రాంతాలను ట్రెక్కింగ్ చేస్తూ బాధిత గ్రామాన్ని సందర్శించారు.
ఏడుగురు చిన్నారులకు (10 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు) ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నట్లు గమనించాం. పిల్లల పరిస్థితి నిలకడగా ఉంది. శాంపిల్స్ సేకరించి వైజాగ్ నగరంలోని కేజీ ఆస్పత్రికి పంపాం. గ్రామస్తులందరికీ యాంటీబయాటిక్స్ మోతాదులు. గ్రామంలో మరో ఏడు రోజుల పాటు ఆరోగ్య సిబ్బంది ఫాలో-అప్ చేస్తారు" అని లీలా ప్రసాద్ తెలిపారు.