వింత వ్యాధి వెనుక రాజకీయ కుట్ర: ఏపీ డీప్యూటీ సీఎం ఆళ్లనాని సంచలనం

Published : Jan 22, 2021, 01:13 PM ISTUpdated : Jan 22, 2021, 01:18 PM IST
వింత వ్యాధి వెనుక  రాజకీయ కుట్ర: ఏపీ డీప్యూటీ సీఎం ఆళ్లనాని సంచలనం

సారాంశం

వింత వ్యాధి వెనుక కూడ రాజకీయ కుట్ర కోణం ఉందని ఏపీ డీప్యూటీ సీఎం ఆళ్లనాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏలూరు: వింత వ్యాధి వెనుక కూడ రాజకీయ కుట్ర కోణం ఉందని ఏపీ డీప్యూటీ సీఎం ఆళ్లనాని సంచలన వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం నాడు ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు..  పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో వరుసగా వింత వ్యాధి కేసులు చోటు చేసుకొంటున్నాయి. 

 దెందులూరు మండలం కొమిరేపల్లిలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన తెలిపారు.జనం రోగాలతో బాధ పడుతుంటే  రాజకీయాలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. దేవాలయాలపై దాడులు జరిగిన ఘటనలను ఆయన ప్రస్తావిస్తూ రాజకీయాల కోసం గతంలో దేవుళ్లను రాజకీయాల్లోకి లాగారన్నారు. ఇప్పుడు ప్రజలను లాగుతున్నారని ఆయన మండిపడ్డారు. 

ఏలూరు పట్టణంలో తొలుత వింత వ్యాధి సోకింది. ఆ తర్వాత భీమడోలు మండలంలో ఇదే తరహలో వ్యాధి సోకింది. తాజాగా దెందులూరు మండలంలో ఈ వ్యాధి వ్యాప్తి చెందింది.

 

PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు