ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై సీబీఐ కేసు: తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

By narsimha lodeFirst Published Sep 22, 2021, 2:33 PM IST
Highlights


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై  సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని సురేష్ దంపతులు సుప్రీంకోర్టును కోరారు.
 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (adimulapu suresh) కి చెందిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు (supreme court) బుధవారం నాడు విచారణ నిర్వహించింది.  ఈ కేసు కొనసాగింపుపై ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది. తమపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (FIR)ను రద్దు చేయాలని  మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను ఏపీ హైకోర్టు (Andhra pradesh High court) గతంలో కొట్టివేసింది. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ కేసులో 111 మంది సాక్షులను విచారించి సీబీఐ కోర్టుకు తెలిపింది.మరో  మూడు మాసాల్లో విచారణ పూర్తి చేస్తామని విచారించింది.ఛార్జీషీటు దాఖలు తర్వాత నిర్ణయం తీసుకోవాలని సీబీఐ సుప్రీంను కోరింది.తమపై కక్ష సాధించేందుకే సీబీఐ ఈ ఎఫ్ఐఆర్ ను నమోదు చేసిందని  మంత్రి సురేష్ తరపు న్యాయవాది సుప్రీంలో వాదించారు.
 

click me!