ఏపీ సెక్రటేరియట్ లో భారీ స్కామ్.. సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల గోల్ మాల్, గుట్టు రట్టు చేసిన ఏసీబీ.. !

By AN TeluguFirst Published Sep 22, 2021, 2:05 PM IST
Highlights

ఈ కేసులో ప్రాథమికంగా ఆధారాలు లభించడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రజా ప్రతినిధుల పీఏలు, అనుచరుల పాత్రపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ : ఏపీ సచివాలయం (AP Secretariat Scam)లో ఇంటి దొంగల గుట్టు రట్టవుతోంది. పేదల డేటా సేకరించి.. వాళ్ల పేరుతో సీఎం రిలీఫ్ ఫండ్ (CM relief fund) నిధులను స్వాహా చేశారు కొందరు కేటుగాళ్లు. వాళ్లు ఒకరో, ఇద్దరో కాదు... ఏకంగా 50 మంది. ఒక్కదగ్గర కుమ్మక్కై గూడుపుఠాణీ నడిపారు. 

ఈ కేసులో ప్రాథమికంగా ఆధారాలు లభించడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రజా ప్రతినిధుల పీఏలు, అనుచరుల పాత్రపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా విస్తరించింది, ఎవరెవరి హస్తం ఉంది అనే కోణంలో విచారణ చేస్తున్నారు. 
 

click me!