ఏపీలో మున్సిపల్ ఎన్నికలు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం నాడు కొట్టేసింది.
న్యూఢిల్లీ: ఏపీలో మున్సిపల్ ఎన్నికలు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం నాడు కొట్టేసింది.
గతంలో నిలిచిపోయిన నాటి నుండి ఎన్నికలను నిర్వహించాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో కొందరు పిటిషన్లు దాఖలు చేశారు.
undefined
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది.గతంలో నిలిచిపోయిన నాటి నుండి ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్రఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.అయితే ఈ నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంలో కొందరు పిటిషన్లు దాఖలు చేశారు pic.twitter.com/CZIxY6juMg
— Asianetnews Telugu (@AsianetNewsTL)ఎన్నికల నిర్వహణ, నోటిఫికేషన్ జారీ చేయడమనేది ఎన్నికల సంఘం విచక్షణ అధికారం పరిధిలోకి వస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.పాత నోటిఫికేఫ్లను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్లు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది.
గత ఏడాది మార్చి మాసంలో మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా కారణంగా ఆ సమయంలో ఎన్నికలను ఎస్ఈసీ వాయిదా వేసింది. గత ఏడాది ఎక్కడ నిలిచిపోయిన చోటు నుండే ఎన్నికలను నిర్వహించాలని తాజాగా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ నెల 10వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.