విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజా ప్రతినిధులంతా రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చాయని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని ఆయన కోరారు.
విశాఖపట్టణం:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజా ప్రతినిధులంతా రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చాయని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని ఆయన కోరారు.
మంగళవారం నాడు విశాఖపట్టణంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాజకీయ పార్టీలన్నీ ఒకే మాటపై నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం జగన్ చొరవ తీసుకొటే టీడీపీ కూడా వెనుక ఉంటుందని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
undefined
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారన్నారు. చంద్రబాబు కూడ ఇదే విషయమై ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికైనా చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ ప్రజలను వైసీపీ, బీజేపీ నేతలు తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
స్టీల్ ప్లాంట్ అమ్మకం జరిగిపోయిందని కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఆయన తెలిపారు. ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలతో మాట్లాడినంత మాత్రాన పవన్ కళ్యాణ్ బాధ్యత అయిపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
also read:విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత: ఫైనాన్స్ డైరెక్టర్ వేణుగోపాల్‌ను అడ్డుకొన్న కార్మికులు
పార్టీల విధానాలకు భిన్నంగా ప్రజా ప్రతినిధులంతా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏపీ ప్రభుత్వం ఓ కార్యాచరణను ప్రకటించాలని ఆయన కోరారు. రాజీనామాలు చేస్తే తాము పోటీకి అభ్యర్ధులను కూడా నిలపబోమని చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.