జూ.ఎన్టీఆర్ ను చంద్రబాబు ముందుకు రానివ్వరు, వెనక్కి వెళ్లనివ్వరు

Published : Feb 27, 2023, 01:43 PM ISTUpdated : Feb 27, 2023, 01:52 PM IST
జూ.ఎన్టీఆర్ ను చంద్రబాబు ముందుకు రానివ్వరు, వెనక్కి వెళ్లనివ్వరు

సారాంశం

జూనియర్ ఎన్టీఆర్ ను నారా లోకేష్ రాజకీయాల్లోకి ఆహ్వానించడం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ఉద్దేశం ఏమిటనేది తెలియడం లేదు. ఎన్టీఆర్ పట్ల చంద్రబాబు తీరు కూడా స్పష్టంగా లేదు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేసిన వ్యాఖ్యలతో జూనియర్ ఎన్టీఆర్ మీద చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ను నూటికి నూరు శాతం రాజకీయాల్లోకి ఆహ్వానిస్తానని నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో భాగంగా యువకులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో అన్నారు. 

ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ (వైసిపీ)లో ఉన్న కొడాలి నాని, టిడిపి తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ కు మిత్రులు. లోకేష్ వ్యాఖ్యలపై వారు తీవ్రంగా ప్రతిస్పందించారు. టిడిపిలోకి నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించడం ఏమిటని వల్లభనేని వంశీ అన్నారు. టిడిపిని జూ.ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ స్థాపించారని ఆయన అన్నారు. టిడిపి వారసత్వం జూనియర్ ఎన్టీఆర్ దేనని, నారా లోకేష్ ది కాదని ఆయన మాటల అంతర్యం.  

మాజీ మంత్రి కొడాలి నాని మరో అడుగు ముందుకు వేశారు. అవసరాల కోసం జూ.ఎన్టీఆర్ ను చంద్రబాబు, లోకేష్ టిడిపిలోకి ఆహ్వానిస్తున్నారని, చంద్రబాబు చేసే అవమానాలు ఎలా ఉంటాయో జూ.ఎన్టీఆర్ కు తెలుసునని ఆయన అన్నారు.జూ.ఎన్టీఆర్ వస్తే టిడిపికి కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందని ఆయన అన్నారు.


జూ.ఎన్టీఆర్ ను టిడిపిలోకి నారా లోకేష్ ఆహ్వానించడంపై మంత్రి రోజా తీవ్రంగా ప్రతిస్పందించారు. టిడిపి ఎన్టీఆర్ పార్టీ అని, జూ.ఎన్టీఆర్ టిడిపిలోకి వస్తే నారావారికి బతుకుదెరువు ఉండదని ఆమె అన్నారు. నారా లోకేష్ పాదయాత్రకు ప్రజలు రావడం లేదని, దీంతో జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తున్నారని ఆమె అన్నారు.

ఇంత జరుగుతున్నా జూ.ఎన్టీఆర్ మాత్రం పెదవి విప్పడం లేదు. అట్లని జూ.ఎన్టీఆర్ కు రాజకీయాసక్తి లేదని కాదు, ఆయన టిడిపిలో ప్రధానమైన పాత్ర పోషించాలనే అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలోని కొందరు నాయకులు జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీలో క్రియాశీలక పాత్ర ఇవ్వాలని అడుగుతూనే ఉన్నారు. కానీ, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. 2009 ఎన్నికల్లో టిడిపి కోసం ఎన్టీఆర్ ప్రచారం చేశఆరు. ఎన్నికలకు కొద్ది రోజులు ఉందనగా ప్రచారానికి విరామం ఇచ్చి ఎన్టీఆర్ ఉగాది పండుగ కోసం హైదరాబాద్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 

అప్పటి నుంచి దాదాపుగా ఆయన పార్టీకి దూరంగానే ఉంటున్నారు. నారా లోకేష్ ను చంద్రబాబును ముందుకు తోస్తున్న క్రమంలో జూ.ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరిక్రిష్ణ తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. చంద్రబాబుకు, హరిక్రిష్ణకు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. అయితే, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వివాదానికి దూరంగానే ఉంటూ వచ్చారు. పిలిస్తే తాను టిడిపికి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓ సందర్భంలో ఎన్టీఆర్ చెప్పారు. కానీ చంద్రబాబు నుంచి ఏ విధమైన స్పందన కూడా రాలేదు.

అయితే, నారా లోకేష్ ఆహ్వానంతో ఆయన టిడిపిలోకి వెంటనే వస్తారని అనుకోవడానికి కూడా లేదు. సినిమాల్లో ఆయన తీరిక లేకుండా ఉన్నారు. రాజకీయాలకు ఇంకా సమయం ఉందనే భావనలో బహుశా ఆయన ఉండవచ్చు. మొత్తం మీద, జూ.ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు తీరు ముందుకు రానీయరు, వెనక్కి వెళ్లనివ్వరు అన్నట్లుగా ఉంటోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం