ఆర్‌ 5 జోన్‌ కేసులో హైకోర్టు ఉత్తర్వులపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరణ..

By Sumanth KanukulaFirst Published May 15, 2023, 1:43 PM IST
Highlights

అమరాతి రాజధాని ప్రాంతంలో ఆర్‌-5 జోన్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను అమరావతి రైతులు సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.

న్యూఢిల్లీ: అమరాతి రాజధాని ప్రాంతంలో ఆర్‌-5 జోన్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను అమరావతి రైతులు సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. రాజధాని అమరావతి కేసు విచారణ జరుపుతున్న ధర్మాసనానం ముందు ఈ పిటిషన్ను బదిలీ చేయడం సబబు అని పేర్కొంది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు తీసుకోవాలని రిజిస్ట్రీని జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం ఆదేశించింది. 

ఇదిలా ఉంటే.. రాజధాని అమరావతిలో బయట ప్రాంతాలకు చెందిన భూమిలేని పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై స్టే విధించాలని కోరుతూ రైతులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు భూ బదలాయింపు చేస్తూ ప్రభుత్వం జారీ  చేసిన జీవో 45, దాని ప్రకారం చేసే ఇళ్ల స్థలాల కేటాయింపు తాము ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉండాలని  హైకోర్టు తెలిపింది. రాజధానిపై హైకోర్టు ఇచ్చిన ఫుల్‌ బెంచ్‌ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించకపోవడంతో మధ్యంతర స్టే ఇవ్వడం సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని అమరావతి రైతులు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. 
 

Latest Videos

click me!