మంగళగిరిలో టీడీపీ ఆఫీస్: సుప్రీంకోర్టు నోటీసులు

By narsimha lodeFirst Published Oct 27, 2020, 12:06 PM IST
Highlights

గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో టీడీపీ కార్యాలయానికి భూ కేటాయింపుల అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో ఈ విషయమై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

న్యూఢిల్లీ: గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో టీడీపీ కార్యాలయానికి భూ కేటాయింపుల అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో ఈ విషయమై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మంగళగిరిలో టీడీపీ కార్యాలయానికి భూ కేటాయింపుల విషయంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ మేరకు టీడీపీకి నోటీసులు జారీ చేసింది.

టీడీపీతో పాటు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏకు నోటీసులిచ్చింది. మూడు వారాల తర్వాత ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఇదే విషయమై గతంలో ఏపీ హైకోర్టులో మంగళగిరి ఎమ్మెల్యే పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎమ్మెల్యే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఉత్తర్వులపై  ఇవాళ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

click me!