జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు: హైకోర్టుకు సుప్రీం మొట్టికాయలు

By Arun Kumar PFirst Published Oct 1, 2020, 1:43 PM IST
Highlights

అమరావతి భూకుంభకోణంలో మాజీ తహసిల్దార్ సుధీర్ బాబు సహా పలువురిపై జరుగుతున్న సీఐడీ దర్యాప్తుపై ఏపీ హైకోర్టు స్టే విధించడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. 

న్యూఢిల్లీ: అమరావతి(తుళ్లూరులో) భూకుంభకోణంలో మాజీ తహసిల్దార్ సుధీర్ బాబు సహా పలువురిపై జరుగుతున్న సీఐడీ దర్యాప్తుపై ఏపీ హైకోర్టు స్టే విధించడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. వారంలోగా ఈ విషయంపై ఏదోఒకటి తేల్చాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది. మూడు వారాల తర్వాత తిరిగి ఈ పిటిషన్ పై తాము విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. 

తుళ్లూరు మాజీ తహశీల్దార్ సుధీర్ బాబు కు అమరావతి భూకుంబకోణంతో సంబంధాలన్నట్లు సీఐడి గుర్తించింది. దీంతో సీఐడి అధికారులు విచారణ జరపుతుండగా అతడు హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఈ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. అయితే  హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై విచారణ జరిపిన దేశ అత్యున్నత హైకోర్టు తీరును తప్పుబడుతూ జగన్ సర్కార్ కు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. 

ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ అంశంలో కేస్ ఏమిటని హైకోర్టు వ్యాఖ్యలు ఎలా చేస్తుందని విస్మయం వ్యక్తం చేసింది సుప్రీం. దర్యాప్తుపై స్టే విధించవద్దు అని మేము అనేక సార్లు చెబుతూనే వస్తున్నామని... చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం ఉండాలి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

READ MORE  

మరోవైపు అమరావతి భూముల స్కాంలో సిట్ దర్యాప్తు, కేబినెట్ సబ్ కమిటీ దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టే ను సవాల్ చేస్తే ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది.

అమరావతిలో భూముల కొనుగోలు విషయంలో టీడీపీ ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని వైసీపీ ఆరోపించింది. అధికారంలోకి  వచ్చిన తర్వాత జగన్ సర్కార్ కేబినెట్ సబ్ కమిటిని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ  నివేదికను ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా సిట్ దర్యాప్తు చేస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ సుమారు 4 వేల ఎకరాల్లో టీడీపీ నేతలు, కుటుంబసభ్యులు  భూములు కొనుగోలు చేశారని నివేదిక తెలిపింది.

ఈ భూముల కొనుగోలు వ్యవహరంపై టీడీపీ నేతలు వర్ల రామయ్య, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై ఇరువర్గాల వాదనలు విన్న ఏపీ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటి ,సిట్ దర్యాప్తు. వ్యవహరంపై స్టే ఇచ్చింది. అమరావతిలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావుపై ఏసీబీ  కేసు నమోదు చేసింది. ఈ నెల 15వ తేదీన శ్రీనివాసరావు సహా 12 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

click me!