సుప్రీం కోర్టులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.
సుప్రీం కోర్టులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని చంద్రబాబు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై నేడు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే విచారణ ప్రారంభం కాగానే.. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు ప్రారంభించారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణకు జస్టిస్ భట్టికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు.
అయితే దాని గురించి దాని తామేమి చెప్పలేమని.. దయచేసి వీలైనంత త్వరగా జాబితా చేయండని లాయర్ హరీష్ సాల్వే కోరారు. అందుకు జస్టిస్ కన్నా.. వచ్చే వారం అని అన్నారు. ఇందుకు స్పందనగా న్యాయవాది సిద్దార్థ లూత్రా.. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందు ప్రస్తావించడానికి అనుమతించాలని కోరారు. ఐదు నిమిషాల సమయ కోరారు.
ఆ తర్వాత జస్టిస్ కన్నా.. విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. ‘‘గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలకు లోబడి.. ప్రస్తుత స్పెషల్ లీవ్ పిటిషన్‌ను అక్టోబర్ 3 నుంచి ప్రారంభమయ్యే వారంలో నా సోదరుడు (జస్టిస్ భట్టి) సభ్యుడు కాని బెంచ్ ముందు ఉంచాలి...’’ అని జస్టిస్ కన్నా ఉత్తర్వులు ఇచ్చారు. అయితే వారం ప్రారంభం అని చెప్పలేమని జస్టిస్ కన్నా పేర్కొన్నారు. అయితే చంద్రబాబు న్యాయవాదులు మాత్రం ఈ పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం ముందు మెన్షన్ చేసేందుకు యత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన తన రిమాండ్‌ను క్వాష్ చేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు.