
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) జడ్జిలుగా ఏడుగురు న్యాయమూర్తుల పేర్లను సుప్రీం కోర్టు కొలీజియం (Supreme Court Collegium) సిఫారసు చేసింది. నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, చీమలపాటి రవి, కొనకంటి శ్రీనివాస రెడ్డి, గన్నమనేని రామకృష్ణప్రసాద్, తర్లాడ రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి, వడ్డిబోయిన సుజాత పేర్లను కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదన చేసింది. జనవరి 29న జరిగిన కొలీజియం మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సిఫారసులకు కేంద్రం ఆమోదం తెలుపాల్సి ఉంది. 2022 జనవరి 17 నాటికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 37 జడ్జి పోస్టులు మంజూరవగా.. ప్రస్తుతం 20 మంది పనిచేస్తున్నారు. 20 జడ్జ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.