అమరావతిపై పిటిషన్లపై విచారణ నుంచి వైదొలిగిన సీజేఐ.. మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని ఆదేశం..

By Sumanth KanukulaFirst Published Nov 1, 2022, 1:05 PM IST
Highlights

అమరావతి రాజధాని వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరిగింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృతంలోని ధర్మాసం ముందు విచారణకు వచ్చాయి.

అమరావతి రాజధాని వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం అసెంబ్లీకి లేదన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి  తెలిసిందే. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం కోరింది. మరోవైపు ఈ కేసులో తమ వాదన కూడా పరిగణలోకి తీసుకోవాలని అమరావతి రైతులు కెవియట్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు.  

అమరావతిపై పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృతంలోని ధర్మాసం ముందు విచారణకు వచ్చాయి. అయితే సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ పిటిషన్ల విచారణకు విముఖత చూపించారు. నాట్ బీఫోర్ మీ అని కామెంట్ చేశారు. తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని జస్టిస్ యూయూ లలిత్ కోరారు. 

Latest Videos

click me!