వార్డు సెక్రటరీలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసే అధికారంపై వెనక్కి తగ్గిన జగన్ సర్కార్

By narsimha lode  |  First Published Nov 1, 2022, 12:41 PM IST

వార్డు సెక్రటరీలకు మాత్రమే  రిజిస్ట్రేషన్ చేసే అధికారంపై ఏపీ  ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ మేరకు ఇవాళ ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు మొమో దాఖలు చేసింది.


అమరావతి:: వార్డు సెక్రటరీలకు మాత్రమే  రిజిస్ట్రేషన్ చేసే అధికారంపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.  సబ్ రిజిస్ట్రేషన్ల  ఆఫీసులలొ కూడ  రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఇవాళ హైకోర్టులో మెమో దాఖలు చేసింది.

రిజిస్ట్రేషన్లు  చేసే అధికారం సబ్  రిజిస్ట్రార్ల నుండి తొలగిస్తూ   వార్డు సెక్రటరీలకు కేటాయించడంపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిల్ పై మంగళవారంనాడు విచారణ నిర్వహించింది హైకోర్టు. ఈ విచారణ సమయంలో ఏపీ ప్రభుత్వం మెమో దాఖలు చేసింది.సబ్  రిజిస్ట్రేషన్ల ఆఫీసుల్లో  కూడా రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది.  పిటిషనర్ తరపున శ్రవణ్ కుమార్ వాదనలు విన్పించారు. వార్డు సెక్రటరీలతో  పాటు సబ్  రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడ రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం  తరపున న్యాయవాది హైకోర్టు ధర్మాసనానికి  వివరించింది.
 

Latest Videos

click me!