జగన్‌ సర్కార్‌కి షాక్: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దు చేసిన సుప్రీంకోర్టు

By narsimha lode  |  First Published Apr 22, 2022, 1:45 PM IST

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు  శుక్రవారం నాడు ఆదేశించింది. 


న్యూఢిల్లీ: ఐపీఎస్ అధికారి AB Venkateswara Rao సస్పెన్షన్ ను Supreme Court శుక్రవారం నాడు రద్దు చేసింది. High Court ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఏబీ వెంకటేశ్వరరావును మళ్ల సర్వీసుల్లోకి తీసుకోవాలని కోరింది. 

నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాాల్పడ్డారనే ఆరోపణలతో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు YS Jagan ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో Suspend చేసింది. అఖిల భారత సర్వీసు ఉద్యోగుల రూల్స్ ప్రకారంగా సస్పెన్షన్ రెండేళ్లకు మించి ఉండకూడదని ఏబీ వెంకటేశ్వరరావు తరపున న్యాయవాది వాదించారు.  రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన SLPని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది., సస్పెన్షన్ రెండేళ్లు ముగిసనందున ఇకపై సస్పెన్షన్ అమల్లో ఉండని సుప్రీంకోర్టు తెలిపింది. 

Latest Videos

undefined

Chandrababu Naidu  సీఎంగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. అయితే ఇజ్రాయిల్ నుండి నిఘా పరికరాల కొనుగోలులో ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలను ఉల్లంఘించారని జగన్ సర్కార్ ఆయనపై కేసు నమోదు చేసింది. అంతేకాదు ఆయనను సస్పెండ్ చేసింది. 

తనపై విధించిన సస్పెన్షన్ ముగిసిందని ఏబీ వెంకటేశ్వరరావు ఈ ఏడాది మార్చి 25న ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు కూడా లేఖ రాశారరు. ప్రతి ఆరు మాసాలకు ఓసారి తనపై విధించిన సస్పెన్షన్ ను పొడిగిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.  తనపై విధించిన సస్పెన్షన్ ఈ ఏడాది జనవరి 27వ తేదీతో ముగిసిందన్నారు.2021 జూలైలో తనపై విధించిన సస్పెన్షన్ ను చివరిసారిగా పొడిగించిన విషయాన్ని వెంకటేశ్వరరావు గుర్తు చేశారు.

తనపై విధించిన సస్పెన్షన్ కు సంబంధించిన జీవోలను రహస్యంగా ఉంచారని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ తనకు కూడా కాపీ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఎలా చూసినా కూడా తన సస్పెన్షన్ ముగిసిందని ఆయన తేల్చి చెప్పారు.

రెండేళ్లకు మించి సస్పెన్షన్ కొనసాగించాలంటే కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాల్సిందేనని చెప్పారు. గడువులోపుగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ నుండి తన సస్పెన్షన్ ను పొడిగించాలని కోరలేదని ఆ లేఖలో సీఎస్ కు గుర్తు చేశారు. దీంతో  తన సస్పెన్షన్ ముగిసినట్టేనని ఆయన గుర్తు చేశారు.సర్వీస్ రూల్స్ ప్రకారంగా తన సస్పెన్షన్ పూర్తైనందున తనకు పూర్తి జీతం ఇవ్వాలని కూడా ఆయన ఆ లేఖలో సమీర్ శర్మను కోరారు.

ఈ లేఖ రాసిన తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పెగాసెస్ అంశంపై చర్చ జరిగింది. ఈ విషయ,మై హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు.ఈ విషయమై కూడా ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. 2019 మే వరకు పెగాసెస్ సహా ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించలేదని ఆయన స్పష్టం చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనకు పీఎస్ సమీర్ శర్మ షోకాజ్ నోటీసు ఇచ్చారు. అయితే ఈ షోకాజ్ నోటీసుకు ఏబీ వెంకటేశ్వరరావు సమాధానమిచ్చారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసినందుకే తాను మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడినట్టుగా ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.

click me!