పేదలకు సంక్షేమ పథకాలు దుష్టచతుష్టయం వద్దంటుంది: ఒంగోలులో సీఎం జగన్

By narsimha lode  |  First Published Apr 22, 2022, 1:26 PM IST

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తాము అధికారంలోకి వస్తే టీడీపీ రద్దు చేస్తుందని ఏపీ సీఎం జగన్ చెప్పారు. ఈ పథకాలు రద్దు చేయడాన్ని ప్రజలు ఒప్పుకొంటారా అని ఆయన ప్రశ్నించారు. ఒంగోలులో ఇవాళ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం మూడో విడత నిధులను విడుదల చేశారు.


ఒంగోలు:  రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని టీడీపీ చెబుతుందని ఏపీ సీఎం YS Jagan ఆరోపించారు. ఈ పథకాలు రద్దు చేస్తే ప్రజలు ఒప్పుకొంటారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కూడా Chandrababu పాలన కావాలని దుష్టచతుష్టయం ప్రయత్నాలు చేస్తుందని జగన్ మండిపడ్డారు. 

YSr Sunna Vaddi Scheme కింద మూడో విడత నిధులను శుక్రవారం నాడు సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. కోటి 2 లక్షల మందికి రూ. 1261 కోట్లను మూడో విడత కింద ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఒంగోలులో నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు. పేదలక ప్రయోజనం చేసే ఈ సంక్షేమ పథకాలను రద్దు చేయడం సమంజసమా అని  ఎల్లో పార్టీని, ఎల్లోమీడియాను దత్తపుత్రుడిని నిలదీయాలని జగన్ కోరారు. 

Latest Videos

చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఉన్న రాష్ట్ర ఆదాయం అప్పు అంతేనని చెప్పారు. కానీ చంద్రబాబు కంటే తమ ప్రభుత్వం కొంచెం అప్పులు తక్కువే చేసిందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో పేదలకు ఎందుకు మంచి చేయలేదో చెప్పాలన్నారు.  కానీ తాము మాత్రం పేదల కోసం మంచి చేయాలనే తలంపుతో ముందుకు సాగుతున్నామని సీఎం జగన్ వివరించారు. 

చంద్రబాబు పేదల కోసం కాకుండా  రామోజీరావు, ఏబీఎన్, టీవీ 5 కోసం పనిచేశాడన్నారు.  70 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే మంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.  గత టర్మ్ లో 56 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవులు ఇచ్చామన్నారు. ప్రస్తుతం రెండో టర్మ్ లో 70 శాతం ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చోటు కల్పించిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన ప్రభుత్వం తమదని జగన్ చెప్పారు. చంద్రబాబు సామాజిక న్యాయం మాటల్లో చెబితే తాము ఆచరించి చూపినట్టుగా జగన్ వివరించారు.

రాష్ట్రంలో చంద్రబాబు పాలన రావాలని దుష్టచతుష్టయం ప్రయత్నాలు చేస్తుందని జగన్ చెప్పారు. చంద్రబాబు, రామోజీరావు, ఏబీఎన్, టీవీ5 లను దుష్టచతుష్టయంగా జగన్ పేర్కొన్నారు. ఈ దుష్టచతుష్టయానికి దత్తపుత్రుడు Pawan Klayan  కూడా జత కలిశాడన్నారు. రాక్షసులు, దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వీల్లేదని దుష్టచతుష్టయం ప్రచారం చేస్తుందన్నారు. 

Andhra Pradeshని మరో Srilankaగా మారుస్తున్నారని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారన్నారు.ఉచితంతతో ఆర్ధిక విధ్వంసం అని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఇంత మంచి జరుగుతున్నా కూడా బాబు పాలనే కావాలని దుష్టచతుష్టయం అంటుందని జగన్ విమర్శించారు. TDP పాలనే కావాలని  చంద్రబాబు దత్తపుత్రుడు కూడా కోరుకుంటున్నారని పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరుగుతున్న మంచి పథకాలను ఆపేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు.  సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఏపీ రాష్ట్రం శ్రీలంక అవుతుందా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు మాదిరిగా ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేయకపోతే ఏపీ రాష్ట్రం అమెరికా అవుతుందని ప్రచారం చేస్తున్నారన్నారు.

టీడీపీకి ఓటేస్తే ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు  ప్రస్తుతం అమలౌతున్న సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని టీడీపీ చెబుతుందన్నారు. ఈ పథకాలు రద్దు చేస్తే ప్రజలు ఒప్పుకొంటారా అని సీఎం జగన్ ప్రశ్నించారు.  తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల పేర్లను చెప్పి ఈ పథకాలను నిలిపివేయాలా అని జగన్ ప్రజలను ప్రశ్నించారు. 

click me!