పంచాయతీ ఎన్నికలపై సుప్రీంలో ఏపీ పిటిషన్: విచారణ మరో బెంచ్‌కి బదిలీ

Siva Kodati |  
Published : Jan 24, 2021, 03:23 PM IST
పంచాయతీ ఎన్నికలపై సుప్రీంలో ఏపీ పిటిషన్: విచారణ మరో బెంచ్‌కి బదిలీ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై విచారణ జరిపే సుప్రీం బెంచ్ మారింది. తొలుత జస్టిస్ లావు నాగేశ్వరరావు బెంచ్‌కు ఈ కేసు వెళ్లింది. 

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై విచారణ జరిపే సుప్రీం బెంచ్ మారింది.

తొలుత జస్టిస్ లావు నాగేశ్వరరావు బెంచ్‌కు ఈ కేసు వెళ్లింది. అయితే వేరే బెంచ్ ముందు రీ లిస్ట్ చేశారు రిజస్ట్రీ. జస్టిస్ సంజయ్ కిషన్, జస్టిస్ రిషికేశ్ రాయ్ ధర్మాసనానికి పిటిషన్ బదిలీ అయ్యింది.

రేపు విచారణ జాబితాలో ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లు వున్నాయి. కాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Also Read:ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామ్ రెడ్డి వ్యాఖ్యలు: పోలీసుల దర్యాప్తు

వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది.

మరోవైపు ప్రస్తుత పరిస్ధితుల్లో పంచాయతీ ఎన్నికలు వద్దంటూ ఏపీ ఉద్యోగ సంఘాలు కూడా అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసింది. 

PREV
click me!

Recommended Stories

Cold Waves : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్
Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu