Ayyannapatrudu : దొంగ సాయిగా... నిన్ను బొక్కలో వేస్తాంరా..: విజయసాయికి అయ్యన్న స్ట్రాంగ్ కౌంటర్

Published : Nov 28, 2023, 01:33 PM IST
Ayyannapatrudu : దొంగ సాయిగా... నిన్ను బొక్కలో వేస్తాంరా..: విజయసాయికి అయ్యన్న స్ట్రాంగ్ కౌంటర్

సారాంశం

తెెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కు పశువులకు సోకే వ్యాధి సోకిందంటూ వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ కు అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. 

అమరావతి : యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించిన టిడిపి నేత నారా లోకేష్ పై వైసిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి లోకేష్ కు పశువులకు సోకే గాలికుంటు, బ్యూ టంగ్ వ్యాధి సోకి నాలుక వాచిందేమో అంటూ ఎద్దేవా చేసారు. ఎవరు నడవమన్నారో, ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర అంటూ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ కు టిడిపి నేత అయ్యన్నపాత్రుడు అతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 

మీ అల్లుడు న‌త్తి ప‌కోడీగాడిని అప్పుడు ఎవరు నడవమన్నారు దొంగ సాయి... అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గురించి అయ్యన్నపాత్రుడు గుర్తుచేసారు.    క‌నిపించిన‌వాళ్ల‌క‌ల్లా ముద్దులు పెట్టి, మూతులు నాకి మీ అల్లుడు ఎందుకు చేశాడురా పాడెయాత్ర‌ అని ఘాటువ్యాఖ్యలు చేసారు. న‌డ‌వ‌లేక కోర్టు వాయిదాల పేరుతో యాత్ర‌ని వాయిదా వేసుకోవ‌డం మీ దొంగ‌ల్లుడికే చెల్లిందంటూ విజయసాయికి కౌంటర్ ఇచ్చారు అయ్యన్నపాత్రుడు.

Read More  Vijayasai Reddy : లోకేష్ కు ఆ వ్యాధి సోకిందా?: విజయసాయి రెడ్డి సంచలనం

''పీక‌ల్లోతు కేసుల్లో ఇరుక్కుని, అధికారంపోతే నీ బ‌తుకేంటో తెలియ‌క మెదడువాపు వ్యాధి వ‌చ్చి పిచ్చి ట్వీట్లు వేస్తున్న దొంగ‌సాయి..మూడు నెల‌ల త‌రువాత ఏ దేశం పారిపోదామా అని ప్లాన్లు వేస్తున్నావ‌ట‌! స‌ప్త‌స‌ముద్రాల అవ‌త‌ల దాక్కున్నా లాక్కొచ్చి తిన్న‌దంతా క‌క్కించి, పేలిన ప్ర‌తీ త‌ప్పుడు కూత‌కీ వాత పెట్టించీ..బొక్క‌లో వేస్తాంరా దొంగ సాయిగా'' అంటూ విజయసాయి రెడ్డిపై అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తెలుగుతమ్ముళ్లకు పూనకాలు తెప్పించే లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Nara Lokesh Powerful Speech
నేను ప్రమాణ స్వీకారం చెయ్యనని మోదీగారితో చెబితే ఆ మాట అన్నారు: CM Chandrababu | Asianet News Telugu