శ్రీ‌వారికి వజ్రాలు, కెంపులు పొదిగిన బంగారు వరద-కటి హస్తాలు విరాళం.. విలువ రూ.3 కోట్ల పైనే

By Siva Kodati  |  First Published Dec 10, 2021, 9:42 PM IST

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సుమారు రూ.3 కోట్లు విలువ చేసే బంగారు వరద-కటి హస్తాలను ఒక దాత శుక్రవారం విరాళంగా అందించారు. వజ్రాలు, కెంపులు పొదిగిన దాదాపు 5.3 కిలోల బరువు గల ఈ బంగారు వరద-కటి హస్తాలను శ్రీ‌వారి ఆల‌యంలోని రంగనాయకుల మండపంలో టిటిడి అదనపు ఈవో ఎవి. ధర్మారెడ్డికి దాత అందజేశారు.


తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సుమారు రూ.3 కోట్లు విలువ చేసే బంగారు వరద-కటి హస్తాలను ఒక దాత శుక్రవారం విరాళంగా అందించారు. వజ్రాలు, కెంపులు పొదిగిన దాదాపు 5.3 కిలోల బరువు గల ఈ బంగారు వరద-కటి హస్తాలను శ్రీ‌వారి ఆల‌యంలోని రంగనాయకుల మండపంలో టిటిడి అదనపు ఈవో ఎవి. ధర్మారెడ్డికి దాత అందజేశారు.

మరోవైపు శ్రీ‌వారి ఆల‌యానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి డిసెంబ‌రు 12న కార్తీక మాసం చివరి ఆదివారం సంద‌ర్బంగా ప్రత్యేక అభిషేకం నిర్వ‌హించ‌నున్నారు. ప‌విత్ర కార్తీక మాసం చివ‌రి ఆదివారం స్వామివారికి తిరుమంజ‌నం నిర్వ‌హించ‌డం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంద‌ర్భంగా స్వామివారికి ఉద‌యం పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రి నీళ్ళ‌తో తిరుమంజ‌నం నిర్వ‌హించి, సింధూరంతో విశేష అలంక‌ర‌ణ చేయ‌నున్నారు.

Latest Videos

undefined

Also Read:టీడీపీ పరిపాలను భవనం వద్ద ఉద్రిక్తత.. ఎఫ్‌ఎంఎస్ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు

మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) పరిపాలన భవనం వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీటీడీ ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌లో విలీనం చేయాలని కోరుతూ ఎఫ్​ఎంఎస్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులు నిరసన (protest ) చేపట్టిన సంగతి తెలిసిందే. వారు గత 14 రోజులుగా ఈ నిరసన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు శుక్రవారం టీటీడీ పరిపాలన భవనం ఎదుట ధర్నాకు దిగారు. కార్మికుల ఆందోళన నేపథ్యంలో టీటీడీ పరిపాలన భవనం ముందు భారీగా మోహరించిన పోలీసులు..నిరసనలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసులు పలువురు ఎఫ్‌ఎంఎస్ కార్మికులను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనపై కార్మికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం జగన్.. పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పాదయాత్ర సమయంలో టైంస్కేల్‌ ఇస్తామన్న హమీని ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ నెరవేర్చాలని కోరుతున్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీకి భిన్నంగా టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవోలు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతిలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో కాంట్రాక్టు కార్మికులు ఆయనను కలిసి కష్టాలను చెప్పుకొన్నారు. టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసన తెలుపుతున్నా పట్టించుకోలేదని సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అయితే సీఎం జగన్ నుంచి సానుకూల స్పందన కనిపించిన.. టైంస్కేల్ హామీ అమలు అయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని కార్మికులు చెబుతున్నారు.

click me!