సూళ్లూరుపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

Siva Kodati |  
Published : Mar 30, 2024, 03:41 PM ISTUpdated : Mar 30, 2024, 03:45 PM IST
సూళ్లూరుపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో వున్న సూళ్లూరుపేట.. జిల్లాల పునర్విభజన తర్వాత తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చింది. సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,37,796 మంది. వీరిలో పురుషులు 1,15,896 మంది.. మహిళలు 1,21,878 మంది. భారత అంతరిక్ష పరిశోధనా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కూడా ఈ సెగ్మెంట్ పరిధిలోకే వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 5 సార్లు , వైసీపీ రెండు సార్లు గెలిచాయి. రెడ్డి, శెట్టి బలిజ, దళిత వర్గాల ఓటు బ్యాంక్ సూళ్లూరుపేటలో అధికం. సూళ్లూరుపేటలో పట్టును కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ కృతి నిశ్చయంతో వున్నారు. మరోసారి సంజీవయ్యకే టికెట్ కేటాయించారు. నెలవల విజయశ్రీకి సూళ్లూరుపేట టికెట్ కేటాయించారు చంద్రబాబు. 

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కీలక నియోజకవర్గం సూళ్లురుపేట. బంగాళాఖాతానికి , పులికాట్ సరస్సుకు ఆనుకుని వుంటూ జీవ వైవిధ్యానికి కూడా పెట్టింది పేరు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో వుండే ఈ సెగ్మెంట్‌లో రెండు ప్రాంతాల సంస్కృతి, సాంప్రదాయాలు సూళ్లూరుపేటలో వుంటాయి. భారత అంతరిక్ష పరిశోధనా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కూడా ఈ సెగ్మెంట్ పరిధిలోకే వస్తుంది. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో వున్న సూళ్లూరుపేట.. జిల్లాల పునర్విభజన తర్వాత తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చింది. సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,37,796 మంది. వీరిలో పురుషులు 1,15,896 మంది.. మహిళలు 1,21,878 మంది. 

సూళ్లూరుపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీ, కాంగ్రెస్‌లకు కంచుకోట :

1962లో జనరల్ నియోజకవర్గంగా ఏర్పాటైన సూళ్లూరుపేట తర్వాత 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారింది. సూళ్లూరుపేట నియోజకవర్గం తొలినాళ్లలో కాంగ్రెస్‌కు ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 5 సార్లు , వైసీపీ రెండు సార్లు గెలిచాయి. రెడ్డి, శెట్టి బలిజ, దళిత వర్గాల ఓటు బ్యాంక్ సూళ్లూరుపేటలో అధికం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కిలివేటి సంజీవయ్య 1,19,627 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి పారాస వెంకట రత్నంకు 58,335 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 61,292 ఓట్ల భారీ మెజారిటీతో సంచలన విజయం సాధించింది.

సూళ్లూరుపేట శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. హ్యాట్రిక్‌పై వైసీపీ కన్ను :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. సూళ్లూరుపేటలో పట్టును కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ కృతి నిశ్చయంతో వున్నారు. మరోసారి సంజీవయ్యకే టికెట్ కేటాయించారు. సంక్షేమం , అభివృద్ధే తనను గెలిపిస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ విషయానికి వస్తే.. తన ఒకప్పటి కంచుకోటలో తిరిగి పాగా వేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. దీనిలో భాగంగా నెలవల విజయశ్రీకి సూళ్లూరుపేట టికెట్ కేటాయించారు. జగన్ పాలనపై వ్యతిరేకత, టీడీపీ జనసేన బీజేపీ కూటమి తనకు కలిసొస్తుందని విజయశ్రీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు
YS Jagan Pressmeet: చంద్రబాబు, పవన్ పై వైఎస్ జగన్ పంచ్ లు| Asianet News Telugu