రుణాల ఎగవేత కేసు: రెండోరోజు సుజనాను విచారించిన ఈడీ

By Nagaraju TFirst Published Dec 4, 2018, 9:21 PM IST
Highlights

బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరిని రెండో రోజూ ఈడీ అధికారులు విచారించారు. బ్యాంకులకు రూ.6000 కోట్ల మేర రుణాల ఎగవేత ఆరోపణల నేపథ్యంలో సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో చెన్నై నుంగంబాక్కంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయమైన శాస్త్రి భవన్‌లోని ఈడీ కార్యాలయంలో ఈ కేసు విచారణ జరుగుతోంది.    

చెన్నై: బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరిని రెండో రోజూ ఈడీ అధికారులు విచారించారు. బ్యాంకులకు రూ.6000 కోట్ల మేర రుణాల ఎగవేత ఆరోపణల నేపథ్యంలో సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో చెన్నై నుంగంబాక్కంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయమైన శాస్త్రి భవన్‌లోని ఈడీ కార్యాలయంలో ఈ కేసు విచారణ జరుగుతోంది.    

ఎంపీ సుజనాచౌదరి విదేశాలకు నిధుల మళ్లింపు, షెల్ కంపెనీల వంటి ఆరోపణల నేపథ్యంలో సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది. అందులో భాగంగా బ్యాంకులకు రుణాల ఎగవేతపైనే ఈడీ అధికారులు సుజనాను ప్రశ్నిస్తున్నారు. 

విచారణలో భాగంగా తొలిరోజు సుజనాచౌదరిని లంచ్ కు అనుమతించిన అధికారులు మంగళవారం మాత్రం భోజన విరామానికి బయటకు అనుమతించలేదు. విదేశాలకు నిధుల తరలింపుపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

120 డొల్ల కంపెనీల ఏర్పాటు, వాటి ద్వారా నిధుల తరలింపు వంటి ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు సుజనాను పలు కోణాల్లో ప్రశ్నించి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. అయితే బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు సుజనాచౌదరి 126 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ కంపెనీల ద్వారా రూ.6వేల కోట్లు రుణాలు తీసుకుని ఆ నగదును షెల్ కంపెనీల ద్వారా బినామీ సంస్థలకు బదలాయించారని ఈడీ గుర్తించినట్లు సమాచారం. 

click me!