బీజేపీలోకి మరో ఇద్దరు టీడీపీ నేతలు: సుజనా రాయబారాలు

By narsimha lodeFirst Published Jun 21, 2019, 4:29 PM IST
Highlights

మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరితో ఇద్దరు టీడీపీ నేతలు టచ్‌లోకి వెళ్లినట్టుగా ప్రచారం సాగింది. ఏపీలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నిస్తోంది.ఇందులో భాగంగానే టీడీపీకి చెందిన నేతలకు ఆ పార్టీ గాలం వేస్తోంది.  

అమరావతి: మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరితో ఇద్దరు టీడీపీ నేతలు టచ్‌లోకి వెళ్లినట్టుగా ప్రచారం సాగింది. ఏపీలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నిస్తోంది.ఇందులో భాగంగానే టీడీపీకి చెందిన నేతలకు ఆ పార్టీ గాలం వేస్తోంది.  

ప్రకాశం జిల్లాకు చెందిన నేతలు సుజనాతో టచ్‌లోకి వెళ్లినట్టుగా చెబుతున్నారు. వారం రోజుల క్రితం  మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి తో ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మెన్ ఈదర హరిబాబు సమావేశమయ్యారు. హరిబాబు బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.

 జిల్లా పరిషత్ చైర్మెన్ పదవి ఈదర హరిబాబు పదవి కాలం వచ్చే నెల 5వ తేదీతో పూర్తి కానుంది. ఈ పదవీ కాలం పూర్తైన  తర్వాత  భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. బాపట్ల మాజీ ఎంపీ శ్రీరాం మాల్యాద్రి కూడ సుజనా చౌదరి శిష్యుడు. సుజనా చౌదరే ప్రోత్సహంతోనే శ్రీరాం మాల్యాద్రి రాజకీయాల్లోకి వచ్చారు.

2014 ఎన్నికల్లో  బాపట్ల నుండి శ్రీరాం మాల్యాద్రి పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి మాల్యాద్రి ఓటమి పాలయ్యాడు. సుజనా చౌదరితో పాటు శ్రీరాం మాల్యాద్రి బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై శ్రీరాం మాల్యాద్రి నుండి స్పష్టత రావాల్సి ఉంది.

2014 ఎన్నికల్లో గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పార్టీ అభ్యర్ధుల ఎంపికలో సుజనా చౌదరి కీలకంగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సుజనా పాత్ర తక్కువగానే ఉంది. ఈ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేను కూడ సుజనా చౌదరి ప్రభావితం చేసే అవకాశం ఉందంటున్నారు. కొన్ని రోజుల్లో ఈ విషయాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.

టీడీపీ నుండి పెద్ద ఎత్తున నాయకులను లాగడం వల్ల రాజకీయంగా  బలపడాలని బీజేపీ భావిస్తోంది. టీడీపీ నేతలను తమ పార్టీ వైపుకు ఆకర్షించే పనిని సుజనా చేసే అవకాశం ఉందంటున్నారు. టీడీపీని భారీగా దెబ్బతీస్తే సుజనాకు బీజేపీలో కీలక పదవులు దక్కే అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతోంది.

ప్రకాశం జిల్లాలోని కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు గురువారం నాడు కాకినాడలో జరిగిన కాపు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతల సమావేశంలో పాల్గొన్నారు. కాపు నేతలంతా టీడీపీలోనే  ఉంటామని ప్రకటించారు. కానీ, అంతర్గతంగా ఈ నేతలు ఏ పార్టీలో చేరితే తమ రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుందనే విషయమై చర్చించారని తెలుస్తోంది.


 

click me!