కారులో ఊపిరాడక బాలుడు మృతి

Published : May 21, 2019, 10:32 AM IST
కారులో ఊపిరాడక బాలుడు మృతి

సారాంశం

కారులో ఊపిరాడక ఏడేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన విశాఖలో చోటుచేసుకుంది. బాలుడు కారులో ఆడుకుంటుండగా... డోర్ లాక్ అయ్యింది. దీంతో... ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. 

రులో ఊపిరాడక ఏడేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన విశాఖలో చోటుచేసుకుంది. బాలుడు కారులో ఆడుకుంటుండగా... డోర్ లాక్ అయ్యింది. దీంతో... ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... విశాఖ నగర పరిధిలోని సింథియాలోని ఓ నేవీ అధికారి ఇంట్లో వినోద్ అనే వ్యక్తి సర్వెంట్ గా పనిచేస్తున్నాడు.అతని భార్య ఇళ్లలో పనులు చేస్తుంటుంది. వీరికి పృథ్వీ, ప్రేమ్‌కుమార్‌ (7) ఇద్దరు మగపిల్లలు. ప్రేమ్‌ ఇటీవలే ఒకటో తరగతి పూర్తిచేశాడు.
 
కాగా... వినోద్ యజమాని కారు శుభ్రం చేస్తుండగా... అక్కడే ఉన్న ప్రేమ్.. కారులో ఉన్న బొమ్మలు చూసి ముచ్చటపడ్డాడు. ఆ బొమ్మలతో తాను ఆడుకుంటానని తండ్రిని కోరాడు. తండ్రి అభ్యంతరం చెప్పకపోవడంతో... కారు ఎక్కి అందులో ఉన్న బొమ్మలతో ఆడుకున్నాడు. తర్వాత కారులో నుంచి కొడుకును కిందకు దించేసి.. కారు కీని యజమానికి ఇచ్చేశాడు.

తర్వాత పని  నిమిత్తం వినోద్ బయటకు వెళ్లగా.. బాలుడు మళ్లీ కారు ఎక్కిబొమ్మలతో ఆడుకున్నాడు. ఆ తర్వాత కారు డోర్ లాక్ పడింది. దీంతో... ఎక్కువ సేపు కారులో ఉండటంతో... ఆక్సీజన్ అందక బాలుడు ఊపిరాడక అందులోనే చనిపోయాడు. కొన్ని గంటల తర్వాత కొడుకు కారులో అచేతన స్థితిలో పడి ఉండటం చూసిన వినోద్ వెంటనే బాలుడ్ని ఆస్పత్రికి తరలించగా..  అప్పటికే కన్నుమూశాడు. 

PREV
click me!

Recommended Stories

Kakinada : గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా కాకినాడ.. చంద్రబాబు, పవన్ స్కెచ్ మామూలుగా లేదుగా !
YCP Leaders Submit Petition to DGP Office Seeking Justice in Salman MurderCase | Asianet News Telugu