తానే సీఎంగా ఫీలవుతున్నారు: చంద్రబాబుపై సుచరిత

Published : Jul 02, 2019, 04:29 PM IST
తానే సీఎంగా ఫీలవుతున్నారు: చంద్రబాబుపై సుచరిత

సారాంశం

చంద్రబాబునాయుడుకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ కంటే  ఎక్కువ సెక్యూరిటీని కల్పిస్తున్నామని ఏపీ  డిప్యూటీ సీఎం  సుచరిత చెప్పారు. ప్రతి  విషయాన్ని రాజకీయం చేయడానికి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

అమరావతి: చంద్రబాబునాయుడుకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ కంటే  ఎక్కువ సెక్యూరిటీని కల్పిస్తున్నామని ఏపీ  డిప్యూటీ సీఎం  సుచరిత చెప్పారు. ప్రతి  విషయాన్ని రాజకీయం చేయడానికి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

 మంగళవారం నాడు  ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు ఇంకా సీఎంగా ఉన్నారనే భ్రమలో ఉన్నారని ఆమె ఎద్దేవా చేశారు.  చంద్రబాబుకు  50 మందితో భద్రత కల్పించాల్సి  ఉంటే  ప్రస్తుతం 74 మందితో భద్రతను కల్పిస్తున్నట్టుగా ఆమె వివరించారు.

రాష్ట్రంలో  శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని  సీఎం ఆదేశించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తనకు భద్రతను తగ్గించారనే విషయమై కోర్టులో బాబు పిటిషన్ వేయడాన్ని ఆమె తప్పుబట్టారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియాచంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu