రైతుల నుండి దోచేసిందంతా... తాడేపల్లి రాజప్రాసాదానికే: దేవినేని ఉమ సంచలనం

By Arun Kumar PFirst Published May 25, 2021, 5:58 PM IST
Highlights

అకాల వర్షాలతో తడిచిన ధాన్యం కళ్లాల్లో మగ్గిపోవడం ఈ ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రికి కనిపించడం లేదా? అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. 

విజయవాడ: పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడానికి వైసిపి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? అని మాజీ మంత్రి  దేవినేని ఉమామహేశ్వరరావు నిలదీశారు. అకాల వర్షాలతో తడిచిన ధాన్యం కళ్లాల్లో మగ్గిపోవడం ఈ ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. బూతుల మంత్రి ధాన్యం కొనుగోళ్లకు ఏవో టోకెన్లు ఇచ్చామంటున్నాడు... ఎవరికి, ఎప్పుడు, ఎన్ని ఇచ్చాడో ఆయనే చెప్పాలి అని మాజీ మంత్రి నిలదీశారు. 

''ముఖ్యమంత్రి జగన్ రైతుల కోసం అంటూ ప్రకటించిన రూ.3వేలకోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? ధాన్యపు రైతుల వెతలు, బాధలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాడని చెప్పి టీ.ఎన్.ఎస్.ఎఫ్ నేత దొండపాటి విజయ కుమార్ ను అరెస్ట్ చేస్తారా? తక్షణమే ప్రభుత్వం విజయ్ ని విడుదల చేయాలి'' అని దేవినేని డిమాండ్ చేశారు. 

''ధాన్యం కొనుగోళ్ల ముసుగులో వైసీపీ నేతలు, దళారులు, మిల్లర్లతో కలిసి రైతులను దోచుకుంటున్నారు. తరుగు, తేమ పేరుతో రూ.1450కు కొనాల్సిన బస్తాను రూ.850కు కొంటున్నారు. బస్తాకు పది కిలోల తరుగు తీసేస్తున్నారు.మామిడి రైతుల గోడు పట్టించుకునేవారే లేరు. ఇలా ధాన్యం రైతులు సహా  వివిధ రకాల రైతుల నుంచి దోచేసిందంతా తాడేపల్లి ప్యాలెస్ కే  చేరుతోంది'' అని సీఎం జగన్ పై ఉమ సంచలన ఆరోపణలు చేశారు. 

read more  వైకాప్స్ మూల్యం చెల్లించక తప్పదు...: పోలీసులకు లోకేష్ వార్నింగ్

''ఈ ప్రభుత్వ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు ఎవరూ సంతోషంగా లేరు. రెండేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం సాగునీటి రంగానికిఎంత ఖర్చుచేసిందో, ఎన్నిప్రాజెక్టులు పూర్తిచేసిందో సమాధానం చెప్పాలి'' అన్నారు. 

''ఈ ముఖ్యమంత్రి జగన్ కి ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులుపెట్టి, వారిని జైళ్లకు పంపడంపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై, రాష్ట్రాభివృద్ధిపై లేదు. ఒకరు జైలునుంచి బయటకురాగానే మరొకరిని లోపలికి పంపడమే ముఖ్యమంత్రి పనిగా పెట్టుకున్నాడు. ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ రాగానే దొండపాటి విజయ్ ను అరెస్ట్ చేశారు.  ముఖ్యమంత్రి తక్షణమే రాజప్రాసాదం నుంచి బయటకు వచ్చి ధాన్యపు రైతుల కష్టాలపై స్పందించాలి'' అని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. 

click me!