రాకాసి అల ఎంత పని చేసింది.. సముద్రంలో కొట్టుకుపోయి విద్యార్థిని మృతి

By Asianet News  |  First Published Aug 22, 2023, 6:58 AM IST

ఓ రాకసి అలా 13 ఏళ్ల బాలిక ప్రాణాలను బలిగొంది. సముద్ర తీరంలో స్నేహితులతో కలిసి సరదాగా స్నానం చేస్తున్న ఆ బాలికను ఓ పెద్ద అల లోపలికి లాక్కొని పోయింది. దీంతో నీట మునగడంతో ఆ బాలిక మరణించింది.


స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లి వస్తానని చెప్పిన ఆ బాలిక.. అంతులేని లోకాలకు వెళ్లిపోయింది. సముద్రతీరంలో సరదాగా గడిపి, స్నానం చేస్తున్న సమయంలో ఓ రాకసి అల ఆమెను లోపలికి లాక్కెళ్లిపోయింది. దీంతో నీట మునిగి ఊపిరాడక ఆ బాలిక మరణించింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని అక్కుపల్లి శివసాగర్‌ బీచ్ లో చోటు చేసుకుంది. 

వివరాలు ఇలా ఉన్నాయి. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని మారుతీ నగర్‌ లో సుంకు కృష్టవేణి-అర్జున్‌ దంపతులు జీడీ కార్మికులకుగా పని చేస్తున్నారు. వీరికి 13 ఏళ్ల కూతురు అక్షయ ఉంది. ఆమె పలాస జడ్పీహెచ్ఎస్ లో 8వ తరగతి చదువుతోంది. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో బడికి వెళ్లలేదు. తన స్నేహితులు, కాలనీ వాసులతో కలిసి అక్కపల్లి శివసాగర్ బీచ్ కు విహారయాత్రకు వెళ్లారు. 

Latest Videos

ఆ బీచ్ లో కొంత సేపు సరదాగా గడిపారు. అనంతరం స్నానం చేద్దామని సముద్రంలోకి వెళ్లారు. కొంత సేపు స్నానం చేసిన తరువాత.. అనుకోకుండా, ఒక్క సారిగా ఓ పెద్ద అల వచ్చింది. తిరిగి వెళ్తూ అక్షయ ను కూడా సముద్రంలోకి లాక్కెళ్లింది. దీనిని గమనించి కింతాడ రాజేశ్వరి అప్రమత్తమైంది. అక్షయను కాపాడేందుకు ప్రయత్నించింది. కానీ ఈ క్రమంలో ఆమె కూడా అందులో చిక్కుకుంది. 

ఈ పరిణామాన్ని అక్కడుతున్న పర్యాటకులు గమనించారు. నీటిలో మునిగిపోతున్నాకాపాడారు. వారిని బయటకు తీసుకొని వచ్చారు. అనంతరం ఆంబులెన్స్ లో వారిని పలాస గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. కాగా.. అక్షయ పరిస్థితి అప్పటికే విషమంగా ఉంది. హాస్పిటల్ కు తీసుకెళ్లిన వెంటనే ఆమె మరణించిందని డాక్టర్లు ప్రకటించారు. రాజేశ్వరికి చికిత్స అందడంతో ఆమె ఇప్పుడు క్షేమంగానే ఉంది. 

దీనిపై సమాచారం అందటంతో వజ్రపుకొత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై పోలీసులు 1కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. 

click me!