విషాదం : సముద్రంలోకి కొట్టకుపోయి.. హైదరాబాద్ యువకుడు మృతి

Published : Feb 19, 2021, 01:29 PM IST
విషాదం : సముద్రంలోకి కొట్టకుపోయి.. హైదరాబాద్ యువకుడు మృతి

సారాంశం

విహారయాత్ర  విషాదంగా మారింది. సరదా ఓ యువకుడి ప్రాణాల్ని తీసింది. గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక బీచ్ లో యువకుడు గల్లంతైన ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ కి చెందిన 12 మంది, యువతీ యువకులు శుక్రవారం ఉదయం బీచ్ కి వచ్చారు.

అక్కడ వారు సరదాగా గడుపుతుండగా, అలల తాకిడికి చే చర్ల రాహుల్ (21సం) అనే యువకుడు సముద్రంలో లోతుకు కొట్టుకుపోయాడు. ఇది గమనించిన తోటివారు వెంటనే కేకలు వేయడంతో సమీపంలోని ఆటో డ్రైవర్లు రక్షించేందుకు ప్రయతించారు. 
 
ఎంతో శ్రమించి సముద్రంలో కొట్టుకుపోతున్న రాహుల్ ను ఆటో డ్రైవర్లు ఒడ్డుకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే రాహుల్ మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. 

రాహుల్ లో వచ్చిన వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని బాపట్ల రూరల్ ఎసై కిరణ్ తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు