
ప్రకాశం జిల్లాలో (prakasam district) విద్యార్ధులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. 15 మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మందికి పైగా విద్యార్ధులు వున్నట్లుగా తెలుస్తోంది. వీరంతా కంభాలపాడు బెల్లంకొండ పాలిటెక్నిక్ కాలేజీలో (bellamkonda polytechnic college) హార్టికల్చర్ విద్యార్ధులుగా సమాచారం. పొదిలి మండం కంభాలపాడు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.