నెల్లూరులో దారుణం.. కాలేజీ గదిలో విద్యార్థినికి అబార్షన్, 19యేళ్ల యువతి మృతి..

By SumaBala Bukka  |  First Published Apr 15, 2023, 6:52 AM IST

నెల్లూరులోని ఓ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని క్లాస్ రూంలోనే అబార్షన్ అయ్యింి. ఆ విద్యార్థిని మృతి చెందింది. 


నెల్లూరు : ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రైవేట్ కాలేజీలో ఓ విద్యార్థినికి కాలేజీ గదిలోనే అబార్షన్ అయ్యింది. ఆ కాలేజీలో బీటెక్ చదువుతున్న ఈ విద్యార్థిని అబార్షన్ తర్వాత మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.  విషయం వెలుగులోకి రావడంతో  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  వారు తెలిపిన వివరాల మేరకు…నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలానికి చెందిన ఓ 19 ఏళ్ల యువతి నెల్లూరులో ప్రైవేట్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. 

ఈనెల 11వ తేదీన స్టూడెంట్స్ అందరూ క్లాస్ బయట కాలేజీ ఆవరణలో ఉన్నారు. క్లాసులో ఎవరూ లేరు. ఆ సమయంలో విద్యార్థిని ఒక్కతే తరగతి గదిలో ఉంది. లోపల తలుపులు ఘడియ పెట్టుకుంది.  ఎంతసేపటికి బయటకి రాలేదు. ఆమె కనిపించడం లేదంటూ వెతికిన స్నేహితులు.. ఆ తర్వాత తరగతి గదిలో ఉందని తెలుసుకొని ఎంతసేపు తలుపులు కొట్టినా తీయలేదు. దీంతో గది తలుపులు పగలగొట్టారు.  అక్కడ..  క్లాస్ రూమ్ లో తీవ్ర రక్తస్రావం మధ్యలో యువతి పడిపోయి ఉంది.  

Latest Videos

undefined

వివేకా హత్య కేసు.. వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

అప్పటికే ఆమె అపస్మారక స్థితిలో ఉండగా.. ఆమె పక్కన  ఆరు నెలల పిండం ఉంది. కాలేజీ సిబ్బంది సహకారంతో విద్యార్థులు వెంటనే ఆ యువతిని, పిండాన్ని పక్కనే ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు.. యువతి అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. నెల్లూరు గ్రామీణ పోలీసులకు ఈ మేరకు సమాచారం అందడంతో వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.

ఈ కేసు మీద దర్యాప్తు కొనసాగించారు. క్లాస్ రూమ్ లో అబార్షన్ అయ్యిందా ? ఆమె యూట్యూబ్లో చూసి ఏమైనా తానే కావాలని అబార్షన్ చేసుకుందా? క్లాస్ రూంలో ఎందుకు ఇలా చేసింది? తల్లిదండ్రులకు ఆమె ప్రెగ్నెన్సీ విషయం తెలుసా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. యువతి సెల్ ఫోను ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. దీంట్లో అనంతసాగరానికి చెందిన ఓ కారు డ్రైవర్ తో ఆమెకు పరిచయం ఉన్నట్లు వెలుగు చూసింది. క్షేత్రస్థాయిలో దీనిమీద విచారణ కొనసాగిస్తున్నట్లు నెల్లూరు గ్రామీణ సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. 
 

click me!