వైసిపి సభ్యత్వానికి, రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయడంవెనక బలమైన కాారణం వుందంటున్నారు మోపిదేవి వెంకటరమణ. ఆ కారణమేంటో...
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మరిచిపోకముందే వైసిపి మరో షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న వైసిపి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణతో పాటు మరో ఎంపి బీద మస్తాన్ రావు రాజీనామా చేసారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ కు తమ రాజీనామా పత్రాలను సమర్పించారు... వైసిపి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఇద్దరు నేతలు ప్రకటించారు.
అయితే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డితో కూడా సన్నిహితంగా వుండేవారు మోపిదేవి. ఇద్దరి మంత్రివర్గాల్లోనూ ఆయన పనిచేసారు. అలాగే వైసిపిలో ఆయన ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి పదవులు పొందారు. ఇలా 2019 ఎన్నికల్లో ఓడిపోయినా ఆయనకు తగిన గౌరవం దక్కిందని.. అలాటి పార్టీ ఆపత్కాలంలో వుండగా ద్రోహం చేసి వెళ్లిపోతున్నారంటూ మోపిదేవి వెంకటరమణపై వైసిపి నాయకులు మండిపడుతున్నారు.
undefined
వైసిపి నాయకుల కామెంట్స్ కు మోపిదేవి కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ ఓడిపోయిన తనను ఎమ్మెల్సీని చేసి మంత్రిపదవి ఇచ్చారని.. ఆ తర్వాత రాజ్యసభకు పంపారంటున్నవారికి అంతకుముందు జగన్ కోసం తాను చేసిన త్యాగాలేమిటో తెలుసా? అని ప్రశ్నించారు. తన గురించి మాట్లాడేముందు అన్నీ తెలుసుకుంటే బావుంటుందని హెచ్చరించారు.
తన రాజీనామా వెనక చాలా బలమైన కారణాలున్నాయన్న మోపిదేవి వాటిని భయటపెట్టడం సరైన పద్దతి కాదన్నారు. రాజీనామా నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకుంది కాదు... గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు సీటు ఇవ్వనపుడే తీసుకున్నానని అన్నారు. కానీ ఎన్నికల సమయంలో పార్టీకి ద్రోహం చేయకూడదనే ఆగానన్నారు. ప్రత్యేక పరిస్థితులే ఈ దిశగా నిర్ణయం తీసుకునేలా చేసాయన్నారు.
గత ఐదు సంవత్సరాలు తనకు వైసిపి తగిన గౌరవమే ఇచ్చింది.... కానీ ఇది తాను ఆశించింది కాదన్నారు మోపిదేవి. రాష్ట్ర రాజకీయాల్లో వుండటానికే తాను ఇష్టపడతాను... అలాంటిది తనను రాజ్యసభకు పంపించారన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా పోటీచేసి తిరిగా రావాలనుకున్నా... అప్పుడూ నిరాశే ఎదురయ్యింది... అందువల్లే రాజీనామా తప్పడంలేదని తెలిపారు.
వైసిపికి, ఆ పార్టీ ద్వారా పొందిన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి టిడిపిలో చేరుతున్నట్లు మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేసారు. ఇప్పటికే తన అనుచరులు, నాయకులతోనే కాదు టిడిని నాయకులతోనూ చర్చించినట్లు తెలిపారు. అందరూ తన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని అన్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కూడా చర్చించి సామరస్యంగా వండేలా చూస్తానన్నారు. తాను ఎలాంటి ప్రలోభాలకు గురికాలేదు... సీఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని నమ్మి టిడిపిలో చేరడానికి సిద్దమైనట్లు మోపిదేవి వెంకటరమణ తెలిపారు.