వివేకా హత్య కేసు: సీబీఐ అధికారులను కలిసిన కుమార్తె సునీత, రెండో రోజూ దొరకని ఆయుధాలు

By Siva KodatiFirst Published Aug 8, 2021, 8:37 PM IST
Highlights

సీబీఐ అధికారులను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ కలిశారు. అలాగే సీబీఐ ముందు వివేకా హత్య కేసు అనుమానితులు మరోసారి హాజరయ్యారు. వాచ్‌మెన్‌ రంగన్న, ఉదయకుమార్ రెడ్డి, ఇనయతుల్లా, ప్రకాష్ రెడ్డి హాజరైన వారిలో ఉన్నారు.

మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. సీబీఐ ముందు వివేకా హత్య కేసు అనుమానితులు మరోసారి హాజరయ్యారు. వాచ్‌మెన్‌ రంగన్న, ఉదయకుమార్ రెడ్డి, ఇనయతుల్లా, ప్రకాష్ రెడ్డి హాజరైన వారిలో ఉన్నారు. వివేకా వంటమనిషి కుమారుడు ప్రకాష్‌ను సీబీఐ విచారిస్తోంది. మరోవైపు సీబీఐ అధికారులను వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ కలిశారు.

మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్ ను పులివెందులకు తీసుకుని వెళ్లారు సీబీఐ అధికారులు. అక్కడ ఆయనను విచారిస్తున్నారు. అదే సమయంలో పులివెందుల తూర్పు వైపున ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ఉన్న వాగులో ఆయుధాల కోసం గాలింపు చేపట్టారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు వాడిన ఆయుధాల కోసం వాగులో గాలింపు చేపట్టారు. మున్సిపల్ అధికారులు, స్థానిక పోలీసుల సహకారంతో సిబిఐ అధికారుుల వాటి కోసం గాలింపు చేపట్టారు. అయితే 20 మంది మున్సిపల్‌ సిబ్బందితో నిన్న, ఈరోజు పులివెందుల రోటరీపురం వాగులో మరికినీరు తొలగించి, యంత్రాలతో మట్టి తొలగించి గాలంచినా ఫలితం లేకపోయింది. రోటరీ పురం ఎడమ భాగంలో అన్వేషణ పూర్తయింది

Also Read:వైఎస్ వివేకా హత్య కేసు: పులివెందుల వాగులో ఆయుధాల కోసం గాలింపు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు ఇటీవల సునీల్ యాదవ్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సునీల్ యాదవ్ ను అంతకు ముందు సిబిఐ అధికారులు విచారించారు. అయితే, ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడు. చివరకు గోవాలో అతను సిబిఐ అధికారులకు చిక్కాడు. 
 

click me!